లక్కు.. కిక్కు | - | Sakshi
Sakshi News home page

లక్కు.. కిక్కు

Oct 28 2025 8:10 AM | Updated on Oct 28 2025 8:10 AM

లక్కు.. కిక్కు

లక్కు.. కిక్కు

● 34 వైన్స్‌ షాపుల ఎంపికకు లక్కీడ్రా ● అదృష్టం వరించిన టెండర్‌దారుల్లో జోష్‌ ● తక్కువ దరఖాస్తుల కారణంగా 6 షాపుల డ్రా వాయిదా ● బందోబస్తు మధ్య సజావుగా ప్రక్రియ

ఆదిలాబాద్‌టౌన్‌: అదృష్టవంతులకు లక్కీ కిక్కు దక్కింది. మద్యం షాపులు దక్కించుకున్న వారి లో జోష్‌ కనిపించింది. డ్రాలో పేర్లు రానివారు నిరాశతో వెనుదిరిగారు. గతంలో షాపులు ద క్కించుకున్న కొంత మందికి మరోసారి లక్కు వరించింది. జిల్లాలో 40 మద్యం దుకాణాలు ఉండగా, 10 కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన 6 షాపులకు లక్కీడ్రా వాయిదా వేశారు. సోమవా రం జిల్లా కేంద్ర సమీపంలోని మావలలో గల రత్నాగార్డెన్స్‌లో 34వైన్స్‌షాపుల కోసం 2025– 27 ఎకై ్సజ్‌ కొత్త మద్యం పాలసీ టెండర్లను ఖరా రు చేశారు. కలెక్టర్‌ రాజర్షిషా లక్కీడ్రా తీసి ఎంపికై న వారి వివరాలు వెల్లడించారు. ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో ఎకై ్సజ్‌ శాఖాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. దరఖాస్తుదారులను మాత్ర మే అనుమతించారు. పలువురు మహిళలు టెండర్లు వేయగా, అందులో పది మందికి షాపులు దక్కినట్లు ఎకై ్సజ్‌ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 1 నుంచి కొత్త మద్యం షాపులను కేటాయించనున్నారు.

అదృష్టవంతులు వీరే..

మద్యం కొత్త పాలసీ కోసం గతనెల 26న ఎకై ్సజ్‌ అధికారులు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించా రు. ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే తక్కువగా రావడంతో ప్రభుత్వం ఈనెల 23 వరకు గడువు పెంచిన విషయం తెలిసిందే. 40 షాపులకు గాను 771 దరఖాస్తులు వచ్చాయి. ఆరుషాపులకు 5వరకు మాత్రమే రావడంతో వా టి లక్కీడ్రాను వాయిదా వేశారు. వాటికి మళ్లీ ద రఖాస్తులు స్వీకరించనున్నారు. లక్కీడ్రాలో పురుషులతో పాటు మహిళలు కూడా పాల్గొన్నారు. ఈసారి దరఖాస్తు ఫీజు రూ.3లక్షలకు పెంచారు. దీని ద్వారా సర్కారు ఖజానాకు రూ.23.13 కోట్లు ఆదాయం సమకూరింది. అయితే ఆరు స్లాబ్‌లుగా లైసెన్స్‌ ఫీజు చెల్లించాల్సి ఉండగా, ఆదిలాబాద్‌ పట్టణంలోని షాపులకు రూ.65లక్షలు, ఇతర ప్రాంతాల్లోని షాపులకు రూ.55లక్షలు, రూ.50లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. షాపుల నిర్వహణకు రెండేళ్ల పాటు కాలపరిమితి ఉంది. డ్రాలో ఎంపికై న వారు 1/6వ వంతు ఫీజు చెల్లించారు. అధికారులు అక్కడే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొదటి షాపు నుంచి లక్కీడ్రా ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఎంపికై న వారు సంతోషంలో మునిగితేలగా, లక్కీ వరించని వారు నిరుత్సాహంతో వెనుదిరిగారు.

మహిళలకు ‘పది’ షాపులు

జిల్లాలో 34 షాపులకు గాను 10 షాపులు మహిళలకు లక్కీడ్రా ద్వారా దక్కాయి. షాప్‌ నం.2, 9 విమలబాయి దక్కించుకున్నారు. షాప్‌ నం.6 నీరజ, షాప్‌ నం.7 గుంజాల లత, షాప్‌ నం.10 సురుకుంటి విద్య, షాప్‌ నం.13 రాజశ్రీ, షాప్‌ నం.20 పోలు అఖిల, షాప్‌ నం.22 తోట సంధ్య, షాప్‌ నం.29 లోక నికిషరెడ్డి, షాప్‌ నం.31 కె.ప్రత్యుష దక్కించుకున్నారు. తమ కుటుంబీకులకు సంబంధించిన మహిళల పేరిట షాపులు రావడంతో వారు సంబరాల్లో మునిగితేలారు.

సందడే సందడి..

ఎకై ్సజ్‌ మద్యం టెండర్ల లక్కీడ్రా ప్రక్రియ కోసం జిల్లా నలుమూలల నుంచి టెండర్‌దారులతో పాటు వారి మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. దీంతో రత్నాగార్డెన్‌ ప్రాంతం సందడిగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. దరఖాస్తుదారులను మాత్రమే లోనికి అనుమతించారు. వారి మద్దతుదారులు గార్డెన్‌లో ఉండడంతో కిక్కిరిసిపోయింది. డ్రా ముగిసిన తర్వాత ఎంపికై న వారి మద్దతుదారుల కేరింతలు మారుమోగాయి.

జిల్లాలోని షాపులు దక్కించుకున్న

లక్కీపర్సన్లు వీరే..

షాప్‌ నం. టోకెన్‌ నం. షాప్‌ నం. టోకెన్‌ నం.

1 23 21 6

2 21 22 4

3 19 23 1

4 8 24 9

5 8 26 9

6 39 27 6

7 34 29 9

8 23 30 11

9 12 31 4

10 18 32 1

11 5 33 7

12 4 34 5

13 9 35 2

14 14 36 2

15 3 37 10

19 29 38 13

20 25 39 26

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement