
రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: రైతులకు ఇబ్బంది కలుగకుండా మార్కెట్‌యార్డులో అన్ని సౌకర్యాలు కల్పించనున్న ట్లు వ్యవసాయ మార్కెటింగ్ గ్రేడ్–2 కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పలు జిన్నింగ్ మిల్లులను లోకల్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిన్నింగ్ మిల్లుల్లో రైతుల కోసం తాగునీరు, కూర్చోవడానికి వసతి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వ్యాపారులను ఆదేశించారు. రైతులకు యార్డులో ఎవరైనా ఇబ్బందులు కలుగజేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 27 నుంచి ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పత్తి తూకం కోసం 11 కాంటాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో మానిటరింగ్ కమిటీ సభ్యులు గోవింద్, విష్ణువర్ధన్, నగేశ్‌రెడ్డి, గోవర్ధన్ యాదవ్, లక్ష్మణ్, విట్టల్ తదితరులు ఉన్నారు.