
మంత్రి ‘తుమ్మల’ను కలిసిన ఎమ్మెల్యే శంకర్
ఆదిలాబాద్: రైతుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ వి న్నవించారు. హైదరాబాద్‌లో బుధవారం కలి సి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సోయా పంటను ప్రభుత్వమే కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు బెంగాల్‌గ్రామ్ విత్తనాలు సబ్సిడీపై ఇవ్వా లని విజ్ఞప్తి చేశారు. అలాగే పత్తి అమ్మకాలకు వచ్చే రైతుల కోసం యార్డులో ఆహార పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. వరద ప్రభావిత మండలాల్లో బాధిత రైతులకు పంట నష్టపరిహారం వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.