
ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
కైలాస్‌నగర్: విద్యార్థులు చదువుతోపాటు ఆరోగ్యం పై దృష్టి సారించాలని కలెక్టర్ రాజర్షి షా అ న్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆరోగ్య పాఠశాల పై బుధవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఆయా మండలాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్టూడెంట్ చాంపియన్లతో సమావేశం అయ్యారు. తొలుత వారి అభిప్రాయాలు స్వీకరించారు. భీంసరి పాఠశాల ఉపాధ్యాయుడు వెంకట్ ఇంగ్లీష్‌లో ఆరోగ్య పాఠశాల, కలెక్టర్ పనితీరు వివరిస్తూ పద్యం రాయగా విద్యార్థులు నేహ, ప్రణవి చదివి వినిపించారు. ఉట్నూర్ జెడ్పీఎస్‌ఎస్ విద్యార్థిని ఆరోగ్య పాఠశాల వలన కలిగే ప్రయోజనాలు, మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలను తెలియజేస్తూ పాట పాడింది. ఈ పాటను ప్రతి పాఠశాలలో ప్లే చే యాలని కలెక్టర్ సూచించారు. ఆరోగ్యపాఠశాలకు సంబంధించిన ప్రాజెక్టులు రూపకల్పన చేసిన ఆది లాబాద్‌లోని రణదీవెనగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలకు రూ.75వేల నగదు పురస్కారం అందజేశారు. అలాగే ఇచ్చోడ మండలం బోరిగాం జెడ్పీ హైస్కూ ల్, జైనథ్, గుడిహత్నూర్ మోడల్ స్కూళ్లకు రూ. 50వేల చొప్పున, అలాగే పిప్పర్‌వాడ ఉన్నత పాఠశాలకు రూ.25వేల నగదు పురస్కారం అందజేశా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ నెల పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించా రు. జిల్లావ్యాప్తంగా 23 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని, నిర్మాణాలకు గాను ఈజీఎస్ నిధులు మంజూరు చేశామన్నారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, కేజీబీవీల ఎస్ వోలు, విద్యార్థులు పాల్గొన్నారు.
‘పర్యాటక’ విజేతలకు బహుమతి ప్రదానం
ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలి చిన విద్యార్థులకు కలెక్టర్ రాజర్షి షా బహుమతులు అందజేశారు. పర్యాటకంపై ఆసక్తిని పెంపొందించేలా గత నెల 19న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కు వ్యాసరచన, ఉపన్యాస, డ్రాయింగ్ పోటీలు ని ర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సర్టిఫి కెట్లు, బహుమతులు అందజేశారు. జిల్లాలోని జలపాతాలు, గిరిజన సంస్కృతి, చారిత్రక ప్రదేశాలు ప ర్యాటక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు. ఇందులో జిల్లా పర్యాటక శాఖ అధికారి రవి కుమార్,గైడ్ లింగన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.