
వైద్యసేవలు మెరుగుపర్చాలి
గుడిహత్నూర్: వైద్యసేవలు మెరుగుపర్చడంతో పాటు ఆసుపత్రుల్లో ఉన్న వైద్య ఉపకరణా లు వినియోగంలో ఉండేలా చూడాలని డిప్యూ టీ డీఎంహెచ్‌వో సాధన సూచించారు. స్థానిక పీహెచ్‌సీని బుధవారం సందర్శించారు. ప్రసూ తిగది, ల్యాబ్‌లో ఉన్న పరికరాలతో పాటు అందుబాటులో ఉన్న మందులు, ఎన్‌సీడీ, ఏఎన్‌సీ, టీబీ, వ్యాక్సినేషన్ రికార్డులు పరిశీలించి సి బ్బందికి పలు సూచనలు చేశారు. ఈ నెల 29 న వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు స్థానిక పీహెచ్‌సీని సందర్శించనున్నారని ఈ మేరకు అన్ని రికార్డులతో పాటు ఉపకరణాలు సక్రమంగా ని ర్వహించాలని సూచించారు. అందిస్తున్న సేవలను స్థానిక వైద్యాధికారి శ్యాంసుందర్‌ను అడి గి తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా ప్రోగ్రాం అధికారి జాదవ్ దేవిదాస్ నాయక్, క్వాలిటీ మేనేజర్ అమర్, డీడీఎం రమణ ఉన్నారు.