
నాణ్యమైన వైద్యసేవలందించాలి
● రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ● ఘనంగా నర్సింగ్ గ్రాడ్యుయేషన్ డే
ఆదిలాబాద్‌టౌన్: వృత్తిని దైవంగా భావించి రోగుల కు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని రిమ్స్ డై రెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. బుధవారం రిమ్స్ ఆడిటోరియంలో నర్సింగ్ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. నర్సింగ్ విద్యార్థుల సాంస్కృతి క ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ మాట్లాడుతూ వైద్యసేవల్లో న ర్సుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్లు దీపక్ పు ష్కర్, బండారి నరేందర్, నర్సింగ్ కళాశాల ప్రిన్సి పాల్ అనిత, లెక్చరర్లు విద్యార్థులు పాల్గొన్నారు.