
కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ
ఆదిలాబాద్: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని ఎంపీ గోడం నగేశ్ బుధవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలో విమానాశ్రయ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా, ఈ నెల 4న రక్షణ, విమానయాన శాఖ అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిగినట్లు మంత్రి ఎంపీకి తెలిపారు. ఈ చర్చలకు కొనసాగింపుగా తమ వద్ద సైతం సమావేశం ఏర్పాటు చేయాలని ఎంపీ విన్నవించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వివరించారు.