
రిమ్స్ డైరెక్టర్‌కు ఐఎస్‌బీ సర్టిఫికెట్
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) సర్టిఫికెట్ అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు ఐఎస్‌బీ కోర్సు నిర్వహించింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు, డైరెక్టర్లకు ఏడాది పాటు శిక్షణ ఇచ్చారు. ఆదిలాబాద్ రిమ్స్ నుంచి రిమ్స్ డైరెక్టర్ కోర్సును పూర్తి చేశారు. శిక్షణలో హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్, నాణ్యమైన వైద్యసేవలు అందించడం తదితర అంశాలపై శిక్షణ నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఐఎస్‌బీ ప్రొఫెసర్ సారంగ్‌దేవ్ సర్టిఫికెట్‌ను అందజేశారు.