
‘సాక్షి’ చొరవ అభినందనీయం
జిల్లా అభివృద్ధికి అవసరమైన ప్రాధాన్యత అంశాల ను గుర్తించి ప్రత్యేక చర్చా వేదిక కార్యక్రమాలను ‘సాక్షి’ ఏర్పాటు చేయడం అభినందనీయం. గతంలో విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి డిబేట్ ఏర్పాటు చేసిన అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి విషయాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. తదనంతరం జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రస్తుతం యూనివర్సిటీ సాధన కోసం ముందుకు రావడం
అభినందనీయం. – దేవిదాస్ దేశ్‌పాండే,
వయోవృద్ధుల సంఘం జిల్లా అధ్యక్షుడు
పాలకుల నిర్లక్ష్యంతోనే..
ఇప్పటికే జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు కావాల్సి ఉన్నప్పటికీ పాలకు ల నిర్లక్ష్యంతో ఆ కల నెరవేరలేదు. గిరి జన విశ్వవిద్యాలయం మంజూరైనప్పటికీ దాన్ని ములుగుకు తరలించారు. అ లాగే గతంలో ఐఐటీ ఏర్పాటు చేస్తామని మొండి చెయ్యి చూపడంతో ఉద్య మం చేస్తే ట్రిపుల్‌ఐటీ వచ్చింది. ఇప్పటికై నా నాయకులు చిత్తశుద్ధి ప్రదర్శించాలి.
– మల్లేశ్, సీపీఎం జిల్లా కార్యదర్శి
వెనుకబాటు ముద్ర పోవాలంటే..
పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వారి పబ్బం గడుపుకోవడానికి వెనుకబడ్డ జిల్లాగా ముద్ర వేశారు. జిల్లాలో వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి అన్ని అవకాశాలు ఉన్నాయి. విశ్వవిద్యాలయం ఏర్పడితే వెనుకబడిన జిల్లా అనే అభిప్రాయాన్ని మార్చవచ్చు.
– కోల కిరణ్‌కుమార్, డైట్ ప్రిన్సిపాల్
వనరులున్నా.. పట్టింపులేదు
ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఎన్నో వనరులతో పాటు అన్నిరకాల యూనివర్సిటీలు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే పాలకుల పట్టింపులేమే ప్రధాన సమస్య. – రాజ హర్షవర్ధన్,
బీసీ స్టడీ సర్కిల్ శిక్షణ అభ్యర్థి
అందరినీ కలుపుకొని పోవాలి..
జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి ఉమ్మడి జిల్లాలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు సంబంధించిన వారిని సైతం కలుపుకొని పోవాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.
– కె.పున్నరావు, నలంద కళాశాల ప్రిన్సిపాల్
ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
యూనివర్సిటీ సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. భావితరం బాగు కోసం ఐక్య పోరాటాలు తప్పనిసరి. దీనికి అన్ని సంఘాలు కలిసి రావాలి.
– అగ్గిమల్ల గణేశ్, డీఎస్పీ జిల్లా అధ్యక్షుడు
వర్సిటీతో యువతులకు మేలు..
జిల్లాలో యూనివర్సిటీ అందుబాటులోకి వస్తే ముఖ్యంగా యువతులకు మేలు జరుగుతుంది. ఉన్న త విద్య అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
– అశ్విని, శిక్షణార్థురాలు

‘సాక్షి’ చొరవ అభినందనీయం

‘సాక్షి’ చొరవ అభినందనీయం

‘సాక్షి’ చొరవ అభినందనీయం

‘సాక్షి’ చొరవ అభినందనీయం

‘సాక్షి’ చొరవ అభినందనీయం

‘సాక్షి’ చొరవ అభినందనీయం