ఇంకా తడబాటే | - | Sakshi
Sakshi News home page

ఇంకా తడబాటే

Jul 10 2025 7:05 AM | Updated on Jul 10 2025 7:05 AM

ఇంకా

ఇంకా తడబాటే

● విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు అంతంతే ● గతంతో పోల్చితే కొంత మెరుగు ● ‘ఫరఖ్‌’ ఫలితాల్లో వెల్లడి

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో పాఠశాల స్థాయి విద్యార్థుల అభ్యసన సామర్థాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. 2017లో లో పర్ఫార్మెన్స్‌గా ఉన్న జిల్లా గతంతో పోల్చితే కొంత మెరుగు పడిందని చెప్పుకోవచ్చు. గతేడాది డిసెంబర్‌లో జాతీయ స్థా యిలో 3,6,9 తరగతుల విద్యార్థులకు పర్ఫామెన్స్‌ అసెస్మెంట్‌ రివ్యూ అనాలసిస్‌ నాలెడ్జ్‌ హోలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌ (ఫరఖ్‌) నిర్వహించారు. అయితే జిల్లాలో ఫలితాలు అంతగా చెప్పుకోదగ్గవిగా లేవు. 50 శాతం కంటే తక్కువగానే సామర్థ్యాలు ఉన్నట్లు తేలింది. రెండు విభాగాల్లో విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ముందు వరుసలో ఉండగా, మిగతా వాటిలో అంతంత మాత్రంగానే నిలిచారు. ఈ ఫలితాలను జాతీయ విద్యా మండలి మంగళవారం విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించారు. వీటి ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు విద్యాశాఖ చర్యలు చేపట్టాల్సి ఉంది.

విద్యార్థుల సామర్థ్యాలు అంతంతే..

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సామర్థ్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చా లామంది హైస్కూల్‌ విద్యార్థులు చదవడం, రా య డం, చతుర్విద ప్రక్రియలు చేయలేకపోతున్నారు. 2017లో నిర్వహించిన న్యాస్‌ పరీక్షలో జిల్లా విద్యార్థులు అత్యంత సామర్థ్యాలు వెనుకబడిన జిల్లాగా దేశంలో నమోదైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాపై దృష్టి సారించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ క్రమంలో కొంత మెరుగు పడింది. గత డిసెంబర్‌లో జిల్లాలో 79 పాఠశాలల్లో ఫరఖ్‌ పరీక్ష నిర్వహించారు. 3వ తరగతికి సంబంధించి 32 పాఠశాలల్లో 713 మంది, 6వ తరగతికి సంబంధించి 27 పాఠశాలల్లో 680 మంది విద్యార్థులు, 9వ తరగతికి సంబంధించి 35 పాఠశాలల్లో 717 మంది విద్యార్థులు ఎగ్జామ్‌ రాశారు. జిల్లా వ్యాప్తంగా 2,3 10 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణకు 298 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తరగతుల వారీగా..

ఈ పరీక్షను 3,6,9 తరగతులకు సంబంధించి తెలు గు, గణితం కూడికలు, తీసివేతలు, భాగాహారాలు తదితర అంశాలపై నిర్వహించారు.

● 3వ తరగతిలో తెలుగు భాషకు సంబంధించి జిల్లా విద్యార్థులు 55 శాతం మంది నిర్ణీత సామర్థ్యాలు సాధించారు. అంటే దాదాపు సగం మంది వరకు తెలుగు చదవలేక పోతున్నారనేది పరీ క్ష ద్వారా తేటతెల్లమైంది. తెలంగాణ రాష్ట్ర శాతం చూస్తే 58 శాతం నమోదైంది. గణితంలో జిల్లా విద్యార్థులు 51 శాతం మంది అర్హత సాధించగా, రాష్ట్రస్థాయిలో 54 శాతం మంది లెక్కలు చేయగలుగుతున్నారు.

● ఆరో తరగతిలో తెలుగు భాషకు సంబంధించి 49 శాతం మంది విద్యార్థులు సామర్థ్యాలు కలిగి ఉన్నారు. గణితంలో 42 శాతం కూడికలు, తీసివేతలు, గుణాకారాలు, భాగహారం సమస్యలు సాధించడంలో 48 శాతం మంది సామర్థ్యాలు కలిగి ఉండగా, భిన్నాలకు సంబంధించి 27 శాతం మందికి మాత్రమే అవగాహన ఉంది.

● 9వ తరగతిలో తెలుగుకు సంబంధించి 47 శా తం విద్యార్థులు సామర్థ్యాలు కలిగి ఉన్నారు. గణితంలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. 36 శాతం మంది మాత్రమే లెక్కలు చేయగలు గుతున్నారు. వివిధ రకాల గణిత అంశాలపై 33 శాతం మందికి మాత్రమే అవగాహన ఉంది. రాష్ట్రంలోని ఆయా జిల్లాల పరిస్థితి కూడా గణితంలో వెనుకబడే ఉండడం గమనార్హం.

సామర్థ్యాల పెంపుపై దృష్టి..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. గతేడాది 3,6,9 తరగతుల విద్యార్థులకు ఎన్‌సీఈఆర్టీ ఫరఖ్‌ పరీక్ష నిర్వహించింది. గతం కంటే విద్యార్థుల సామర్థ్యాలు మెరుగ్గానే ఉన్నాయి. మరింత మెరుగుపర్చేందుకు చర్యలు చేపడతాం. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.

– శ్రీనివాస్‌రెడ్డి, డీఈవో

ఇంకా తడబాటే1
1/1

ఇంకా తడబాటే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement