నిరుద్యోగికి డబ్బులు వాపస్
ఆదిలాబాద్‌టౌన్: ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఓ కిలేడీ బాధితుల డబ్బులు తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. ‘నిరుద్యోగులకు ఎర..’ శీర్షికన ‘సాక్షి’లో శని వారం కథనం ప్రచురితమైంది. ఆదిలాబాద్‌కు చెందిన ఓ నిరుద్యోగి నుంచి ఉ ద్యోగం ఇప్పిస్తానని రూ.2లక్షలకు బేరం కుదుర్చుకుంది. మొదటగా రూ.20వేలు తీసుకుంది. మిగతావి ఉద్యోగ నియామక పత్రం ఇచ్చాక ఇవ్వాలని తెలిపింది. ‘సాక్షి’ కథనం నేపథ్యంలో శనివారం రాత్రి ఆమె ఫోన్‌పే ద్వారా రూ.20వేలు పంపినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కాగా, ఆమె నార్నూర్ మండలానికి చెందినట్లు సమాచారం.


