విద్యాభివృద్ధికి కృషి
బజార్‌హత్నూర్: బడుగు, బలహీన వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ గోడం నగేశ్ అన్నా రు. మండలంలోని జాతర్ల గ్రామంలో పార్డి(బి), పట్నాపూర్, మాడగూడ గిరిజన బాలుర, బాలిక ఆశ్రమ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన సా మూహిక అక్షరాభ్యసన కార్యక్రమంలో బోథ్ ఎమ్మె ల్యే అనిల్ జాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ జాదవ్ అంబాజీ, ఏసీఎంవో అర్క జగన్, జీసీడీవో చాయ, ఏటీడీవో అమిత్, ఎంఈవో కిషన్‌గుప్తా, ప్రధానోపాధ్యాయులు కిషన్‌రెడ్డి, చందన్, శ్రీనివాస్, సుదర్శన్, కృష్ణారావ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
బోథ్: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఎంపీ నగేశ్ అన్నారు. సొనాల మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బడిబాట కార్యక్రమం సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేశారు. ఇందులో జీవీ.రమణ, రాజు తదితరులు పాల్గొన్నారు.
సూచనలు పాటించాలి
రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి అధిక దిగుబడి సాధించాలని ఎంపీ నగేశ్ అ న్నా రు. సొనాల మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు, వికసిత్ కృషి సంకల్ప కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మొక్కలు నాటారు. ఇందులో బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


