● మంత్రి వివేక్‌కు పోర్ట్‌పోలియోపై చర్చ ● కేటాయింపుపై క
సాక్షిప్రతినిధి, మంచిర్యాల: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పరిపాలన తదితరవన్నీ జిల్లా కు మంత్రి లేకపోవడంతో జాప్యం అవుతోంది. ప్రస్తుతం అన్ని పథకాల అమలులో ఇన్‌చార్జి మంత్రి కీలకం. ఉమ్మడి జిల్లాకు ప్రస్తుతం మంత్రి సీతక్క కొనసాగుతున్నారు. జిల్లాల వారీగా అభివృద్ధి, పథకాల అమలుపై సమీక్షలు, సమావేశాలు, నియోజకవర్గాల వారీగా పర్యటనలు చే యాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇకపై వివేక్ ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీంతో పథకాల అమలు, అభివృద్ధి పర్యవేక్షణలో సులువు కానుంది. ప్రభుత్వ పరంగా వేడుకలు, అధికారిక కార్యక్రమాలు మంత్రి హోదాలో జరగనున్నాయి.
శాఖలపై కసరత్తు
రెండో విడతలో మంత్రులుగా అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ ప్రమాణం స్వీ కారం చేశారు. వీరికి శాఖలు కేటాయించాల్సి ఉంది. మంత్రి మండలిలో ఖాళీగా హోం, మున్సిప ల్, గనులు, కార్మిక, పశుసంవర్ధక, పాడి, సంక్షే మం, ఇతర శాఖలు ఖాళీగా ఉండడంతోపాటు రెండేసి, మూడేసి శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు ఉన్నారు. ఈ క్రమంలో కొత్తగా బాధ్యతలు చే పట్టనున్న వారికి ఎవరికి ఏ శాఖ ఇస్తారోనని ఆస క్తి నెలకొంది. ఇప్పటికే పార్టీ అధిష్టానం దీని పై కసరత్తు చేస్తుండగా,త్వరలోనే స్పష్టత రానుంది.
వివేక్‌పైనే ఆశలు
17 నెలలుగా ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా లేకపోవడంతో నాయకులతోపాటు ప్రజలకు లోటు ఏర్పడింది.కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నలుగురిలో ఒక రికై నా మంత్రి పదవి వస్తుందని ముందు నుంచి ప్రచారం ఉంది. అయితే పలుమార్లు వాయిదా పడింది. తాజాగా వివేక్‌కే అమాత్య యోగం ద క్కడంతో ఆయనపై ఉమ్మడి జిల్లా వాసుల్లో ఆశలు నెలకొన్నాయి. తన నియోజకవర్గం చెన్నూరుతోపాటు మిగతా ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, గిరిజన ప్రాంతాలు, సింగరేణి తదితర అనేక సమస్యలు ఉన్నాయి.
సీఎంను కలిసిన మంత్రి, ఎంపీలు
చెన్నూర్: రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాద పూ ర్వకంగా కలిశారు. ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించిన అధి ష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు.


