
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమశాతం పెరగనుంది.
ఇది కొత్తగా ఏర్పడిన సాత్నాల
మండలంలోని పిప్పల్‌గావ్ రోడ్డు దుస్థితి. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే మోకాల్లోతు గుంతలతో బురదమయంగా మారింది. పిప్పల్‌గావ్ నుంచి మేడిగూడ వరకు తొమ్మిది కిలోమీటర్ల వరకు ఇదే పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కాదు కదా కనీసం ఆటో, ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని దుస్థితి. ఏటా వానాకాలం వచ్చిందంటే ఆయా గ్రామాల ప్రజలకు దారి ఇక్కట్లు షరా మామూలే అన్నట్లుగా
మారుతున్నాయి.