మహనీయుడు అంబేడ్కర్
ఆదిలాబాద్‌రూరల్/అదిలాబాద్‌టౌన్: అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహానీయుడు అంబేద్కర్ అని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలను జి ల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాల య ఆవరణలో సోమవారం నిర్వహించా రు. కలెక్టర్, ఎస్పీతో పాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. సమాజంలో అన్నివర్గాల ప్రజ లకు న్యాయం అందించాలనే విధంగా రాజ్యాంగ కల్పన చేసిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. యువత మహనీయులు చూపిన బాటలో న డుస్తూ ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. కాగా, అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ జయంతిల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో రాణించిన వారికి ప్రశంసపత్రాలు అందజేశారు.ఇందులో అద నపు కలెక్టర్ శ్యామలా దేవి, జిల్లా దళితాభివృద్ధి శాఖ అధికారిని సునిత కుమారి, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ రా జ్యాంగ రచనలో అంబేడ్కర్ కృషిని కొనియాడారు. ఇందులో అదనపు ఎస్పీ బి.సురేందర్‌రావు, డీఎస్పీలు జీవన్ రెడ్డి, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
రాజ్యాంగం కల్పించిన అవకాశాలను బడుగు, బలహీన వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థి కంగా ఎదగాలని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పా యల్ శంకర్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్‌లో గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు ప్రవీణ్, సుభాష్, ధరంపాల్, సతీష్, మహేందర్, రవి, వేద వ్యాస్, కృష్ణయాదవ్, సూర్యకిరణ్, ముకుందరావు, తదితరులున్నారు.
అంబేడ్కర్ జీవితం స్ఫూర్తిదాయకం
నేరడిగొండ: అంబేడ్కర్ జీవితం అందరికీ స్ఫూ ర్తిదాయకమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నా రు. అంబేడ్కర్ జయంతి వేడుకలను మండల కేంద్రంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ ధ్యేయం
కై లాస్‌నగర్: రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ జైబాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఆమెర్ అలీఖాన్ అన్నారు. అంబేడ్కర్ జయంతి పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన బైక్ ర్యాలీకి ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు. పట్టణంలోని ప్రజా సేవా భవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధానవీధులు గుండా అంబేడ్కర్‌చౌక్ వరకు కొనసాగింది. అంబేద్కర్ విగ్రహానికి ఆయనతో పాటు పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శేఖర్, శ్రీనివాస్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
మహనీయుడు అంబేడ్కర్
మహనీయుడు అంబేడ్కర్
మహనీయుడు అంబేడ్కర్


