రాష్ట్ర విద్యాసదస్సు జయప్రదం చేయండి
ఆదిలాబాద్‌టౌన్: టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిష్ట న్న, అశోక్ కోరారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో సదస్సు పోస్టర్‌ను ఆదివారం ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈనెల 28, 29 తేదీల్లో జనగాం జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలి పారు. మొదటి రోజు నిర్వహించే సదస్సుకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరువుతారని పేర్కొన్నారు. జిల్లా నుంచి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇందులో సంఘం నాయకులు శ్రీనివాస్, స్వామి, ఇస్తారి, గౌస్ మోయినొద్దీన్, శివన్న తదితరులు పాల్గొన్నారు.


