‘బాల చెలిమి’ విజేతలకు బహుమతి ప్రదానం
జైనథ్: చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలచెలిమి కథల పోటీలో జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపికయ్యారు. జైనథ్ మండలకేంద్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుడు వి జేతలుగా ఎంపికయ్యారు. పిల్లల కథల విభాగంలో మండలంలోని కూర గ్రామానికి చెందిన గీస శ్రీజ రాసిన ‘వ్యవసాయం’, లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన తల్లెల కీర్తి రాసిన ‘మట్టి గణపతి’ కథలు ఎంపికవగా.. పెద్దల విభాగంలో లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ప్రధానోపాధ్యాయుడు పోరెడ్డి అశోక్ రాసిన ‘గూడు మార్చిన కాకి’ ఉత్తమ కథగా నిలిచా యి. విజేతలకు హైదరాబాద్‌లో ఆదివారం బ హుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, బాల చెలిమి సంపాదకులు వేద కుమార్ తదితరులు పాల్గొన్నారు.


