● రిజిస్ట్రేషన్లు పెరిగినా తగ్గిన ఆదాయం ● గతేడాది కంటే
ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
కైలాస్‌నగర్: ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే కీ లకమైన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రెండేళ్లుగా త గ్గుతూ వస్తోంది. ప్రధానంగా 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లా రిజిస్ట్రేషన్ శాఖకు రాబడి భారీగా తగ్గింది. గతేడాదితో పోల్చితే ఈసారి రూ.14.61 కోట్ల ఆదాయం తక్కువైంది. రియల్ ఎస్టేట్ వ్యాపా రం భారీగా పడిపోవడం, ఎల్‌ఆర్‌ఎస్ లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయకూడదనే ప్రభుత్వ నిబంధన రాబడిపై తీవ్ర ప్రభావం చూపాయి.
రిజిస్ట్రేషన్లు స్వల్పంగా పెరిగినా..
జిల్లాలో ఆదిలాబాద్, బోథ్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను 13,966 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగగా వాటి ద్వారా రూ.45,53,63,701 ఆదా యం సమకూరింది. గత 2023–24 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 13,307 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగగా వాటి ద్వారా రూ.60,15,52,152 ఆదా యం చేకూరింది. ఈ లెక్కన గతేడాది కంటే 659 ఆస్తుల రిజిస్ట్రేషన్లు పెరిగినా రూ.14,61,88451 ఆదాయం తక్కువగా వచ్చింది. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏడాది పొడవునా రిజిస్ట్రేషన్ల సందడి ఉంటుంది. బోథ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యవసాయ పంటల ఉత్పత్తుల సీజన్‌లోనే రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతాయి. మిగతా సమయాల్లో నామమాత్రంగా ఉంటాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ రెండు కార్యాలయాల్లోనూ గతేడాది కంటే రిజిస్ట్రేషన్లు కాస్త పెరిగాయి. ఆదిలాబాద్‌లో 439 రిజిస్ట్రేషన్లు పెరగగా ఆదా యం మాత్రం రూ.14.61 కోట్లు తక్కువగా వచ్చింది. బోథ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 220 రిజిస్ట్రేషన్లు పెరగగా రూ.72.82లక్షల ఆదాయం అధికంగా వచ్చింది. ఇక్కడ గతేడాదితో పోల్చితే ఈసారి రిజిస్ట్రేషన్లు పెరగడంతో పాటు వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరిగింది.
‘రియల్’ వ్యాపారం పడిపోవడంతోనే
జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం గత ఆర్థిక సంవత్సరంలో ఆశించిన స్థాయిలో జరగలేదు. భూములు, ప్లాట్ల క్రయ, విక్రయాలు మందగించాయి. దీనికి తోడు ఎల్‌ఆర్‌ఎస్ లేని అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయవద్దనే ప్రభుత్వ నిబంధనతో రిజిస్ట్రేషన్లు పూర్తిస్థాయిలో జరగలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో ప్రభుత్వం అక్రమ లేఅవుట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ను 25శాతం ఫీజు రాయితీతో అమలు చేయగా రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. 2020లో రూ.వెయ్యి చెల్లించి అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. దీంతో గతేడాది కంటే రిజిస్ట్రేషన్లు కాస్త పెరిగాయి. అప్పటి మార్కెట్ విలువ ప్రకారంగానే రిజిస్ట్రేషన్లు చేయగా ఆశించిన మేర ఆదాయం సమకూరలేదు. దీనికి తోడు డీటీసీపీ అనుమతి కలిగిన లేఅవుట్‌లలోని ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలనే ప్రభుత్వ ఆదేశాలూ రిజిస్ట్రేషన్ల శాఖపై తీవ్ర ప్రభావం చూపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సంవత్సరాల వారీగా జరిగిన రిజిస్ట్రేషన్లు, వచ్చిన ఆదాయం
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సంవత్సరం రిజిస్ట్రేషన్లు ఆదాయం (రూపాయల్లో)
ఆదిలాబాద్ 2022–23 10,766 72,10,07,999
ఆదిలాబాద్ 2023–24 12,294 60,15,52,152
ఆదిలాబాద్ 2024–25 12,733 45,53,63,701
బోథ్ 2022–23 1,503 7,70,63,740
బోథ్ 2023–24 1,013 2,19,67,476
బోథ్ 2024–25 1,233 2,91,49,819
ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనే కారణం
రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా పడిపోవడంతో ప్లాట్ల క్రయ, విక్రయాలు గతేడాది ఆశించిన స్థాయిలో జరగలేదు. డీటీసీపీ అనుమతి లేని ప్లాట్లు, ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించని వాటికి రిజిస్ట్రేషన్లు చేయవద్దనే ప్రభుత్వ ఆదేశాలు కూడా రిజిస్ట్రేషన్లపై ప్రభావం చూపాయి. గత ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. అప్పటి మార్కెట్ విలువ ప్రకారంగానే రిజిస్ట్రేషన్లు చేయగా ఆశించిన స్థాయిలో ఆదాయం చేకూరలేదు.
– విజయ్‌కాంత్‌రావు,
సబ్ రిజిస్ట్రార్–1, ఆదిలాబాద్
సంవత్సరాల వారీగా జరిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలు
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సంవత్సరం ప్లాట్లు ఇండ్లు ఇంటిస్థలాలు
ఆదిలాబాద్ 2022–23 158 3,257 7,351
ఆదిలాబాద్ 2023–24 104 3,418 8,772
ఆదిలాబాద్ 2024–25 152 5,756 6,825
బోథ్ 2022–23 1 377 1,125
బోథ్ 2023–24 0 561 452
బోథ్ 2024–25 0 786 447
● రిజిస్ట్రేషన్లు పెరిగినా తగ్గిన ఆదాయం ● గతేడాది కంటే
● రిజిస్ట్రేషన్లు పెరిగినా తగ్గిన ఆదాయం ● గతేడాది కంటే
● రిజిస్ట్రేషన్లు పెరిగినా తగ్గిన ఆదాయం ● గతేడాది కంటే


