‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక...’ అన్న వాక్కులు అక్షర సత్యాలు. ప్రపంచం నిండా కవిత్వం నిబిడీకృతమై ఉంది. జీవితానికి, జీవన అనుభవానికి ఆలంబన కవిత్వమే. సంక్లిష్ట సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, నిద్రాణమైన జాతిని, మనిషిని మేల్కొల్పడానికి సరైన సాధనం కవిత్వమే. ‘కవియాత్ర’ పేరిట వర్ధమాన కవులను ప్రోత్సహించే నావంతు చిరు ప్రయత్నం చేస్తున్నా.
– కారం శంకర్, ‘కవియాత్ర’
జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు, నిర్మల్