
చరిత్రలో ఈరోజు
ఫ్రాన్స్‌ను కుదిపేసిన ఫ్రెంచ్ విప్లవం.. 1789–99 మధ్యకాలంలో చాలా ఉధృతంగా కొనసాగింది. ఈ విప్లవం ఆ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప అలజడికి దారితీసింది. ఈ కాలంలో ఫ్రాన్స్ వ్యాప్తంగా సామాజిక, రాజకీయ విప్లవానికి తెరలేచింది. దేశంలో రాజరికంపై, భూస్వాములపై సామా న్యుల తిరుగుబాటు మొదలైంది. 1792, ఆగస్టు 10వ తేదీన ఫ్రాన్స్ రాజు 16వ లూ యీస్, రాణి మేరీ ఆంటోనిట్‌ను తిరుగుబా టుదారులు నిర్బంధించారు. తదనంతర కా లంలో వీరిని విచారించి శిరచ్ఛేదనం శిక్ష వి ధించారు. దేశంలో రాజరికాన్ని రద్దు చేశారు.