కడెం: మండలంలోని కొత్తమద్దిపడగ గ్రామ ంలోని అటవీ నర్సరీలో మొక్కలు ధ్వంసం చేసిన 16మందిని శుక్రవారం బెయిల్‌పై విడుదల చేసినట్లు కడెం ఎఫ్‌ఆర్వో అనిత తెలిపారు. ఇటీవల వడ్ల కల్లం కోసం స్థలం కావాలని అటవీ నర్సరీలోకి చొరబడి మొక్కలు ధ్వంసం చేసినందుకు సుప్రీంకోర్టు సూచన మేరకు 16మందికి నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. అటవీ చట్టాలపై అవగాహన లేనందున అలా ప్రవర్తించామని, ఒకరిద్దరు జామీను ఇవ్వడంతో కండిషనల్ బెయిల్ మీద వారిని విడుదల చేశామని తెలిపారు. అటవీ వన్యప్రాణి సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.