
డ్యాన్స్ చేస్తున్న విద్యార్థులు
● డీఈవో ప్రణీత
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థుల్లో దాగి ఉన్న కళలను వెలికితీసేందుకు కళోత్సవం ఎంతగానో దోహద పడుతుందని డీఈవో ప్రణీత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో శుక్రవారం వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు. జిల్లాలోని ఆయా పాఠశాలలకు చెందిన 101 మంది విద్యార్థులు హాజరై కళలను ప్రదర్శించారు. జానపద నృత్యం, ఫోక్ డ్యాన్స్, పెయింటింగ్, ఏకపాత్రాభినయం, తబలా, హార్మోనియం తదితర పోటీల్లో పాల్గొని ఆకట్టుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన పది మంది బాలికలు, పది మంది బాలురను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తున్నట్లు డీఈవో పేర్కొన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు సుజాత్ ఖాన్, శ్రీకాంత్‌గౌడ్, న్యాయ నిర్ణేతలు కబీర్‌దాస్, వజ్రమాల, కవిత, సతీష్, నరేందర్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.