
ఆదాయం : 2006–07లో తన ఆదాయం రూ.1,70,248గా చూపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఆదాయాన్ని ఇన్‌కంటాక్స్‌లో చూపించలేదు. తన భార్య కంది సాయి మౌన రెడ్డి ఆదాయాన్ని 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,85,000, 2019–20లో రూ.5,54,010లుగా చూపించారు. కాగా అప్పటి నుంచి 2023–24 వరకు ఆదాయాన్ని చూపించలేదు.
కేసులు: తనపై 7 క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఒక సీఆర్‌ఎల్‌పీ కేసు ఉందని అఫిడవిట్‌లో నమోదు చేశారు.
నగదు: తన చేతిలో రూ. 3,45,000, తన భార్య చేతిలో రూ. 2,35,000లు నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. తన వద్ద రూ. 10,40,000ల విలువ గల 162 గ్రామలు బంగారం ఆభరణాలు, భార్య వద్ద రూ. 78,60,000విలువ గల 1278 గ్రాముల బంగారం ఆభరణాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో వివరించారు. పైన పేర్కొన్న వాటితో కలిపి వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు, బాండ్లు, షేర్ల రూపంలో తన పేరిట మొత్తం రూ. 8,98,76,833లు ఉన్నట్లు తెలిపారు. తన భార్య పేరిట రూ.27,51,15,289 ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎలాంటి వ్యవసాయ భూములు లేవని, రూ.12,10,76,432 విలువ గల కమర్షియల్ బంగ్లాలు, రెసిడెన్షియల్ బంగ్లాలు తన పేరిట ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. తన భార్య పేరుపై రూ.2,28,00,000లుగా ఉన్నట్లు తెలిపారు.
రుణాలు: వివిధ బ్యాంకుల్లో తన పేరిటి రూ.4,96,85,258 రుణాలు ఉన్నట్లుగా ఆయన ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో వివరించారు.