ఊపందుకున్న రాజకీయాలు
సాక్షి,ఆదిలాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజ కీయ పార్టీల్లో సందడి కనిపిస్తుంది. ప్రచార పర్వం ఊపందుకుంటుంది. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలను అధికార పార్టీ బీఆర్‌ఎస్ అనువుగా మార్చుకుంటుంది. ఇక హస్తం పార్టీ గడపగడపకూ కాంగ్రెస్ పేరిట ప్రజల వద్దకు వెళ్తుంది. మరోవైపు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపడుతూ ప్రజల పక్షాన నిలిచేందుకు యత్నిస్తోంది. మొత్తంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి ప్రధాన పార్టీలు.
బీఆర్‌ఎస్..
D¯ðlÌS 22 Ð]lÆý‡MýS$ {糿¶æ$-™èlÓ… {糆Úët-™èlÃ-MýS…-V> °Æý‡Ó-íßæ-çÜ$¢¯]l² §ýlÔ>-¼ª Ðólyýl$-MýS-ÌZÏ ½BÆŠ‡-G‹Ü {Ôóæ×æ$-Ë$ E™éÞ-çßæ…V> ´ëÌŸY…r$-¯é²Æý‡$. ™öÑ$Ã-§ólâýæÏ ´ëÌS-¯]l-ÌZ ™èlÐ]l$ çÜÆ>PÆý‡$ ^ólíܯ]l AÀ-Ð]l–-¨®° ÆøkMø M>Æý‡Å-{MýSÐ]l$… §éÓÆ> ÑÐ]l-ÇçÜ*¢ A…§ýl-DZ BMýS-r$t-MýS$¯ól {ç³Ä¶æ$-™é²-Ë$ ^ólçÜ$¢¯é²Æý‡$. ïÜG… MóSïÜBÆŠ‡ EÐ]l$Ãyìl hÌêÏ-ÌZ° °Æý‡ÃÌŒæ, Ð]l$…_Æ>ÅÌS çÜ¿ýæ-ÌZÏ ´ëÌŸY-¯]lyýl… VýS$Ìê½ ´ëÈtÌZ E™éÞ-çßæ… MýSÍWçÜ$¢…¨. ™égêV> ¨ÐéÅ…VýS$ÌS í³…bèl¯ŒS ò³…^èl-yé-°² A«¨M>Æý‡-´ë-Èt ÑçÜ–¢-™èl…-V> {ç³^éÆý‡… ^ólçÜ$-MýS$…r$…¨. GÐðl$Ã-ÌôæÅ-Ë$ gZVýS$ Æ>Ð]l$¯]l², Æ>£øyŠæ »êç³N-Æ>Ð]l#, Æó‡RêÔ>ÅÐŒl$ ¯éĶæ$MŠS, B{™èl… çÜMýS$P C…§ýl$-ÌZ ´ëÌŸY…r$-¯é²Æý‡$. {Ôóæ×æ$-ÌS¯]l$ E™éÞçßæ ˘ ç³Æý‡$-çÜ$¢-¯é²Æý‡$.
కాంగ్రెస్..
హస్తం పార్టీ విషయానికొస్తే జిల్లాలో ఆ పార్టీ నేతలంతా ఒక్కటై గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం ద్వారా ప్రజలను కలుస్తూ ముందుకు సాగుతున్నారు. మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి మార్గదర్శకత్వంలో డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత తదితరులు ఇంటింటికీ వెళ్లి పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు ఇటీవల పార్టీలో చేరిన కంది శ్రీనివాస్‌రెడ్డిని పారాచూట్ నేతగా పాతనేతలంతా అభివర్ణిస్తున్నారు. ఇక బోథ్ నియోజకవర్గంలో అడె గజేందర్, వన్నెల అశోక్ పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు.
బీజేపీ..
కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రజా సంపర్క్ యాత్ర ద్వారా బీజేపీ ప్రజల్లోకి వెళ్తోంది. అలాగే అధికార పార్టీ అక్రమాలను ఎండగడుతూ నిరసనలు చేపడుతోంది. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఖానా పూర్ చెరువు కజ్జాపై జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అలాగే రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ నెలకొల్పుతామని తీసుకున్న భూ ములను నిర్వాసితులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ చిట్యాల సుహాసినీరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆదివాసీ గూడాల్లో రవాణా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు సైతం చేపట్టారు.
వివిధ వర్గాలను ఆకట్టుకునే దిశగా..
ఇక ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల జిల్లా కేంద్రంలో పర్యటించి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే వివిధ వర్గాల ప్రజలను ఆకర్షించేందుకు పలు పార్టీలు యత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ జిల్లా కేంద్రానికి విచ్చేయడం గమనార్హం. అలాగే విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ సభలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు.