
పొచ్చర సబ్‌స్టేషన్‌లో పడిపోయిన ఫీడర్లు
బోథ్: ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి పలు చోట్ల వృక్షాలు పడిపోయాయి. కరెంట్ తీగలు రోడ్లపై పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బోథ్ మండలంలోని పలు గ్రామాల్లో మొక్కజొన్న నేలకొరిగింది. పొచ్చర విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఫీడర్లు పడిపోయాయి. నేరడిగొండ, బజార్‌హత్నూర్, ఇచ్చోడ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు జైనథ్, బేల, తలమడుగు, తాంసీ, భీంపూర్ మండలాల్లో చిరుజల్లులు కురిశాయి.

కోకస్‌మన్నూర్‌లో కురిసిన వడగళ్ల వాన