breaking news
weights
-
కండ కలిగితే ఆయుష్షు కలదోయ్!
ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. దీంతోపాటు అప్పుడప్పుడూ కండలు పెంచేందుకు బరువులెత్తండి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే కండలు ప్రదర్శనకు మాత్రమే కాదు...నాలుగు కాలాలు ఎక్కువ బతికేందుకూ సాయపడతాయట. ఇదేదో ఆషామాషిగా చేసిన అధ్యయనం కాదండోయ్. అమెరికాలో సుమారు 30 ఏళ్లుగా 1.5 లక్షల మంది నర్సులను పరిశీలించి చేసుకున్న నిర్ధారణ. రెండేళ్లకు ఒకసారి వీరి నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. వారంలో 90 – 120 నిమిషాలపాటు స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు (బరువులు, పుషప్స్, బెంచ్ ప్రెస్, పుల్అప్స్, డంబెల్స్, బార్బెల్స్) చేస్తే చేయని వారితో పోలిస్తే అకారణంగా మరణించే అవకాశాలు 13% తగ్గినట్లు తేలింది. అలాగే గుండెజబ్బులతో మరణించే చాన్స్ 19%, నాడీ సమస్యలతో చావు ముప్పు 27% తక్కువైనట్లు తెలిసింది. బరువులు ఎత్తితే ఆరోగ్యమన్నారు కదా అని అతిగా చేయొద్దని కూడా ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. వారానికి రెండు గంటల కన్నా ఎక్కువ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు చేసినా అదనపు ప్రయోజనం ఏదీ లభించలేదు. మరో విషయం.. ఏరోబిక్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు రెండు చేస్తే లాభమెక్కువ. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి కనీసం రెండున్నర గంటలు చేసిన వారిలో చావు ముప్పు 26 నుంచి 43 % తక్కువగా ఉన్నట్లు స్పష్టం కాగా... స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు జోడిస్తే ముప్పు మరింత తగ్గింది. ఒకే ఒక్క మినహాయింపు ఏమిటంటే... కేన్సర్ ఉన్న వాళ్లు స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు కొంత తగ్గించడం అవసరం. వారంలో గంటపాటు చేసినా మెరుగైన ఫలితాలుంటాయి. కండలతో దీర్ఘాయుష్షు ఎలా...? శరీరం మొత్తమ్మీద జీవక్రియల పరంగా బాగా చురుకుగా ఉండేవి కండల్లోని కణజాలాలు. అందువల్లనే కండలు బలంగా ఉంటే రక్తంలోని గ్లూకోజు నియంత్రణ సాధ్యమవుతుంది. మధుమేహం నుంచి రక్షణ లభిస్తుందన్నమాట. ఇది కాస్తా గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. కండరాలు ముడుచుకుపోయినప్పుడు విడుదలయ్యే మైయోకైన్స్ అనేక జబ్బులకు దారితీయగల ఇన్ఫ్లమేషన్ (మంట/వాపు)లను తగ్గిస్తుంది. కండలు కాలేయం, కొవ్వు కణజాలం, రక్తనాళాలు, ఎముకలు, మెదళ్లకూ మేలు జరుగుతుంది. దీర్ఘకాలంలో ఈ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు రక్తపోటును తగ్గించడమే కాకుండా.. రక్తనాళాలు పెళుసు బారకుండా చేస్తాయి. ఇవి గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కండలు గట్టిగా ఉంటే పట్టు బాగా ఉంటుంది కాబట్టి పడిపోవడం, ఎముకలు విరగడం వంటివి తక్కువగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం...జిమ్‌కు వెళ్లినా వెళ్లకపోయినా.. ఇంట్లోనే రోజూ కాసేపు బరువులు ఎత్తేయండి. దీర్ఘాయుష్మాన్ భవ అని మీకు మీరే దీవించేసుకోండి! –సాక్షి, నేషనల్ డెస్క్ -
నగల దుకాణాల మోసాలు..!
తెలంగాణవ్యాప్తంగా తూనికలు - కొలతల శాఖ దాడులు 30 కేసులు నమోదు హైదరాబాద్ : బంగారం వినియోగదారులు నిలువునా మోసపోతున్నట్లు తూనికలు-కొలతల శాఖ దాడుల్లో బహిర్గతమైంది. స్వచ్ఛతలో, తూకంలో దగా, నాణ్యత లేమి, తరుగు పేరుతో జ్యూయెలరీ షాపులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలింది. తెలంగాణ వ్యాప్తంగా నాలుగురోజులుగా జ్యూయెలరీ షాపులు, షాపింగ్స్ మాల్స్‌పై దాడులు నిర్వహించిన తూని కలు-కొలతల శాఖ వివిధ షాపులపై 30కు పైగా కేసులు నమోదు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలోని పలు జ్యూయెలరీ షాపుల్లో తనిఖీలు చేసి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర కంట్రోలర్, అదనపు డీజీపీ గోపాల్ రెడ్డి బుధవారం మీడియాకు తెలిపారు. స్వర్ణాభరణాల కొనుగోలులో మోసాలను అరికట్టేందుకు జిల్లా కేంద్రాలలో బంగారం స్వచ్ఛత కొలిచే మీటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. బంగారంపై ఆఫర్స్, డిస్కౌంట్స్‌పై ఆప్రమత్తంగా వ్యవహరించాలని వినియోగదారులకు సూచించారు. కాగా, జ్యూవెల్లరీషాపులు 24 క్యారెట్ల బంగారం అని చెపుతూనే అంతకంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్ని వినియోగదారులకు అంటగడుతున్నట్లు, సరైన బిల్లు ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తనిఖీలలో గుర్తించారు. బాణసంచా దుకాణాలపై దాడులు సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగను పురస్కరించుకొని తెలంగాణలోని బాణసంచా దుకాణాలపై తూనికల, కొలతల శాఖ కొరడా ఝళిపించింది. బాణసంచా హోల్‌సేల్ దుకాణాలపై 54 కేసులు నమోదు చేసినట్లు ఆ శాఖ కంట్రోలర్, అదనపు డీజీపీ ఎస్.గోపాల్‌రెడ్డి బుధవారమిక్కడ చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, సూర్యాపేట, భువనగిరి, షాద్‌నగర్ తదితర ప్రాంతాల్లోని బాణసంచా దుకాణాలపై దాడులు నిర్వహించగా పలు మోసాలు బయటపడినట్లు చెప్పారు. పలు దుకాణాలపై కేసులు నమోదు చేసి రూ.20 లక్షల విలువైన సరుకును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. -
‘హెరిటేజ్’ తూకాల్లో తేడాలపై కేసు
-
‘హెరిటేజ్’ తూకాల్లో తేడాలపై కేసు
సాక్షి, హైదరాబాద్: పాలు, పాల ఉత్పత్తుల తూకాల్లో తేడాలు ఉండటంతో హెరిటేజ్ మిల్క్ డెయిరీతో సహా మొత్తం ఆరు సంస్థలపై కేసులు నమోదు చేశామని తూనికలు-కొలతల శాఖ కంట్రోలర్, అదనపు డీజీ ఎస్.గోపాల్‌రెడ్డి సోమవారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన దాడుల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయని వెల్లడించారు. హెరిటేజ్, జెర్సీ, తిరుమల, శకుంతల, కర్నూలు, వర్ధన్నపేట స్వకృషి ఉమెన్స్ కోపరేటివ్ డెయిరీలు, తయారీ యూనిట్లలో ఈ తనిఖీలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. తూకాల్లో అవకతవకలకు సంబంధించి హైదరాబాద్‌లో 9, ఏలూరులో 4, నిజామాబాద్‌లో 1, కర్నూలులో 3, విశాఖపట్నంలో 2, విజయవాడలో 2, కరీంనగర్లో 2, వరంగల్‌లో ఒక కేసు నమోదు చేశామన్నారు. రెండు ప్లాంట్లలోనే తేడాలు: హెరిటేజ్ ఫుడ్స్ తూనికలు-కొలతల శాఖ దాడులకు సంబంధించి హెరిటేజ్ పా‘పాలు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్ ఎం.సాంబశివరావు లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు. తూనికలు-కొలతల శాఖ అధికారులు శనివారం బయ్యవరం (విశాఖపట్నం), బొబ్బిలి (విజయనగరం), పామర్రు (తూర్పుగోదావరి), నార్కెట్‌పల్లి (నల్లగొండ), ఉప్పల్ (హైదరాబాద్)ల్లో ఉన్న తమ ప్లాంట్లలో తనిఖీలు చేశారని అంగీకరించారు. మూడింటిలో తూకాలు పక్కాగా ఉండగా... రెండింటిలో మాత్రమే తేడాలు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారని పేర్కొన్నారు. మరోపక్క తమ ఉత్పత్తులపై కేరళ ప్రభుత్వం నిషేధం విధించిన మాట వాస్తవమే అన్న ఆయన... అది తాత్కాలికమైందని, ఆపై తామిచ్చిన సాంకేతిక వివరణతో సంతృప్తి చెంది నిషేధాన్ని ఎత్తివేశారని సాంబశివరావు పేర్కొన్నారు. -
ఇనార్భిట్మాల్పై దాడులు


