breaking news
Wedding Dress Factory
-
ప్రభాస్ పెళ్ళి దుస్తులు ఇక్కడే కొంటాం: శ్యామలా దేవి
ప్రభాస్ పెళ్ళి దుస్తులు హైదరాబాద్‌లోనే కొంటామని చెబుతోంది ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి. తాజాగా ఆమె నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి,యువ నటుడు రక్షిత్ అట్లూరితో కలిసి జూబ్లీహిల్స్‌లో జరివరం స్టోర్ ఓపెనింగ్‌కి అతిథిగా వెళ్లారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనకు కంచి పట్టు చీరలంటే చాలా ఇష్టమని..ఈ స్టోర్‌లో చాలా వెరైటీలు ఉన్నాయని తెలిపింది. ప్రభాస్ పెళ్లికి ఇక్కడ నుంచే దుస్తులు కొనుగోలు చేస్తామని చెప్పారు.రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ : జరివరం స్టోర్ ఓపినింగ్ కు రావడం చాలా హ్యాపీ గా ఉంది..ఇక్కడ చీరల కలెక్షన్స్ చాలా యూనిక్ గా ఉన్నాయి... వైవిద్యం కోరుకొనే మహిళలకు ఈ జరివరం కలెక్షన్స్ తప్పకుండా నచ్చుతాయి అని తెలియజేశారు.హైద్రాబాద్ లో ఉండే అతివలకు బెస్ట్ కలెక్షన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అభిలాష రెడ్డితో కలిసి నా భార్య గాయత్రి ఈ స్టోర్‌ని ప్రారంభించిందని నటుడు కృష్ణుడు అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, అభిలాష రెడ్డి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లిళ్లకు ఆ సీజన్ బాగుంటుంది!
ఈ మధ్య తాప్సీ సినిమాలు చేయడంతో పాటు పెళ్లికి సంబంధించిన ప్లాన్స్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. ఓహో.. తాప్సీకి పెళ్లి ఫిక్సయ్యిందేమో అనుకుంటున్నారా? అదేం కాదు. బిజినెస్‌లో భాగంగా ఈ ప్లాన్స్ చేస్తున్నారు. పెద్ద పెద్దవాళ్లంతా వెడ్డింగ్ ప్లానర్స్‌ని సంప్రతించి, పెళ్లి వేడుకలకు సంబంధించిన మొత్తం బాధ్యతలను వాళ్లకు అప్పగించేస్తారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. అందుకే తాప్సీ తన చెల్లెలు షగున్‌తో కలిసి ‘వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ పేరుతో వ్యాపారం మొదలుపెట్టారు. అయితే, తాప్సీ ఈ బిజినెస్‌ని ధనార్జనే ధ్యేయంగా మొదలుపెట్టలేదు. అదొక కారణం మాత్రమే అంటున్నారు. ఈ బిజినెస్ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఇప్పటివరకూ తాప్సీ, షగున్ కొన్ని వివాహ వేడుకలను సక్సెస్‌ఫుల్‌గా చేశారు. పెళ్లికి వర్షాకాలం చాలా బాగుంటుందని తాప్సీ చెబుతూ - ‘‘మాన్సూన్లో వాతావరణం బాగుంటుంది. చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి, మన మూడ్ కూడా దాదాపు అలానే ఉంటుంది. పైగా, వర్షాకాలంలో ఎక్కువగా తిరగలేం. అందుకని ఏదైనా వేడుకకు వెళితే అక్కడ గంటలు గంటలు గడుపుతాం. ఆ విధంగా. బంధువులు, స్నేహితులతో వేడుక ప్రాంగణం కళకళలాడిపోతుంది. వేడిగా ఉండదు కాబట్టి, మేకప్ చెరగదు. హ్యాపీగా పట్టుచీరలు కట్టుకోవచ్చు. ఎన్ని నగలైనా పెట్టుకోవచ్చు. అదే సమ్మర్ అనుకోండి.. ఇంత భారీగా రెడీ కాలేం. అందుకే మ్యారేజెస్‌కి మాన్సూన్ బెస్ట్ అంటున్నా’’ అని చెప్పారు.