breaking news
Venkata shiva
-
వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం
తిరుపతి క్రైమ్: తిరుపతిలో వైఎస్సార్సీపీ నాయకుడిపై శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అలిపిరి సీఐ రామారావు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఎన్జీవో కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు వెంకటశివారెడ్డి ఇంటి ఎదురుగా గిరీష, శ్రీలక్ష్మి అనే వ్యక్తులు నివాసం ఉండేవారు. వీరు ప్రతి రోజు మద్యం, గంజాయి తాగి రచ్చరచ్చ చేస్తుండేవారు. వారి ప్రవర్తన వల్ల ఎదురు ఇంట్లో ఉంటున్న వెంటకశివారెడ్డి కుటుంబానికి నిద్ర ఉండేది కాదు.ఈ విషయంపై వెంకటశివారెడ్డి, గిరీషకు మధ్య తరచూ గొడవలు జరిగేవి. అదేవిధంగా గిరీష కొద్దికాలం కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి స్టలం ఇప్పిస్తానని రూ.20లక్షలు తీసుకుని మోసం చేశాడు. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడిగా ఉన్న వెంకటశివారెడ్డిని ఆశ్రయించి న్యాయం చేయాలని కోరారు. దీంతో గిరీష కుటుంబ సభ్యులను వెంకటశివారెడ్డి పిలిపించి వారి డబ్బులు ఇవ్వాలని సూచించారు. దీంతో వెంకటశివారెడ్డి, గిరీష మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఆ గొడవలు జరిగిన అనంతరం గిరీష, శ్రీలక్ష్మి ఇల్లు వదిలి వెళ్లిపోయారు. వారు ఎన్నికలకు ముందు తిరిగి వచ్చారు.హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి ఇవ్వాల్సిన డబ్బులు గురించి ఎన్నికల తర్వాత మాట్లాడదామని గిరీష చెప్పాడు. ఈ నేపథ్యంలో వెంకటశివారెడ్డి శనివారం ఉదయం ఎన్జీవో కాలనీలోని తన నివాసం నుంచి వాకింగ్‌కు బయలుదేరి వెళ్లారు. మెయిన్ రోడ్డులో ఉన్న అరవింద స్కూల్ సమీపాన ఆటోస్టాండ్ వద్దకు వెళ్లగానే ఆయనపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేశారు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన వెంకటశివారెడ్డిని స్థానికులు హుటాహుటిన ఆస్పపత్రికి తరలించారు.వెంకటశివారెడ్డిపై గిరీష కక్ష పెంచుకుని, ఆయన ఉదయం వాకింగ్‌కి వెళ్లే సమయంలో దాడి చేయాలని ముందుగానే రెక్కీ నిర్వహించినట్లు సీసీ ఫుటేజీలో నమోదైంది. వెంకటశివారెడ్డి కుమారుడు బాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ రామారావు వెల్లడించారు. -
దైవదర్శనానికి వెళ్లి.. తిరిగిరాని లోకాలకు..
సంతమాగులూరు, న్యూస్‌లైన్ : కుటుంబ సభ్యులంతా దైవదర్శనానికి వెళ్లి తిరిగి కారులో ఇంటికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం పాలయ్యారు. మిగిలిన కుటుంబ సభ్యులు తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఈ విషాదకర సంఘటన గుంటూరు-కర్నూలు రహదారిపై కామేపల్లి వద్ద సోమవారం ఉదయం జరిగింది. ముందు వెళ్తున్న నవత ట్రాన్స్పోర్ట్ లారీని వెనక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో బల్లికురవ మండలం గుంటుపల్లికి చెందిన ఓగూరి అశోక్(27), ఆయన తండ్రి అంజయ్య(55) దుర్మరణం పాలయ్యారు. కారులో ప్రయాణిస్తున అశోక్ తల్లి కుమారి, సోదరి అరుణ.. ఆమె కుమార్తె, స్నేహితుడు వెంకటశివలు తీవ్రగాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు అక్కడకు వెళ్లి క్షతగాత్రులను బయటకు తీసి నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. వివరాలు.. వ్యవసాయంపై ఆధారపడి జీవించే ఓగూరి అంజయ్య, కుమారి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అశోక్ ఇంజినీరింగ్ పూర్తిచేసి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉన్నత శ్రేణి ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. కుటుంబ సభ్యులు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. కుమార్తె అరుణకు వివాహమై ఒక కుమార్తె. ఈ నేపథ్యంలో అంజయ్య, అయన భార్య కుమారి, వారి కుమార్తె అరుణ.. ఆమె కుమార్తెతోపాటు అశోక్ స్నేహితుడు, కొప్పెరప్పాడుకు చెందిన వెంకటశివ ఆదివారం ఉదయం బస్సులో శ్రీశైలం వెళ్లారు. హైదరాబాద్ నుంచి అశోక్ కారులో ఆదివారం సాయంత్రానికి శ్రీశైలం వచ్చాడు. అందరూ కలసి దైవదర్శనం ముగించుకుని సోమవారం ఉదయం కారులో ఇంటికి బయల్దేరారు. అప్పటికే అశోక్‌కు రోజంతా నిద్రలేదు. తప్పక కారు నడపాల్సి వచ్చింది. కారు కామేపల్లి సమీపంలోకి రాగానే అశోక్ కునుకు తీశాడు. అంతే వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న నవత ట్రాన్స్పోర్ట్ లారీని బలంగా ఢీకొట్టింది. కారు ముందు భాగం లారీ కిందకు చొరబడిపోవడంతో అశోక్ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారందరూ రేకుల మధ్య చిక్కుకుపోయారు. సమాచారం తెలిసిన ఎస్సై ఎ.శివనాగరాజు తన సిబ్బందితో అక్కడకు చేరుకుని కారులో చిక్కుకున్న తండ్రి అంజయ్య, కుమారి, అరుణ ఆమె కుమార్తెతో పాటు వెంకటశివను బయటకు తీశారు. అప్పటికే అంజయ్య కూడా మృతి చెందాడు. క్షతగాత్రులను పోలీస్ జీపులోనే నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి గుంటూరు తీసుకెళ్లారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలకు పంచనామా నిర్వహించి నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్సై ఎ.శివనాగరాజు తెలిపారు.