breaking news
vallyball
-
అప్పుడు బంజరు భూమి... ఇప్పుడు ప్లేగ్రౌండ్
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలోని మారుమూల గ్రామం... చింద్నార్. ఈ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వెనక ఉన్న బంజరు భూమి ఇప్పుడు వాలీబాల్ కోర్టు, రన్నింగ్ ట్రాక్, క్లైంబింగ్ వాల్, లాంగ్ జంప్ పిట్... మొదలైన వాటితో అందమైన ప్లేగ్రౌండ్‌గా మారింది. ఈ గ్రామంలోనే కాదు దంతెవాడ జిల్లాలో ఎన్నో మారుమూల గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల వెనకాల ఉన్న బంజరు భూములు అందమైన ప్లేగ్రౌండ్స్‌గా మారి ఆహా! అనిపిస్తున్నాయి.ఈ మార్పుకు కారణం... సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్, మన్ దేశీ ఫౌండేషన్. ప్లేగ్రౌండ్స్కే పరిమితం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు స్పోర్ట్స్ కోచ్‌లుగా శిక్షణ ఇస్తున్నారు. ప్లేగ్రౌండ్ నిర్మాణ ప్రక్రియ అనేది కమ్యూనిటీ ఈవెంట్‌గా మారింది. గ్రామప్రజలు ప్లేగ్రౌండ్ నిర్మాణ పనుల్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.మన దేశంలో 65–70 శాతం స్కూల్స్‌లో సరిౖయెన ప్లేగ్రౌండ్లు లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని రాష్ట్రాలలోనూ తన ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని సంకల్పించాయి సచిన్, మన్ దేశీ ఫౌండేషన్లు. (చదవండి: డెలివరీ ప్రాసెస్ ఇలా ఉంటుందా..? బిజేపీ నాయకుడి కుమార్తె...) -
హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
బాపట్ల: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు మంగళవారం హోరాహోరీగా సాగాయి. ప్రకాశం జిల్లా బోయినవారిపాలెం, బాపట్ల మండలం వెదుళ్ళపల్లి కొత్తపాలెం జట్లు మధ్య పోటాపోటీగా జరిగిన మ్యాచ్‌లో బోయినవారిపాలెం టీము గెలుపొందింది. అదేవిధంగా బేతపూడి, వైఎస్సార్‌నగర్‌కు చెందిన టీములు తలపడగా వాటిలో బేతపూడి టీము గెలుపొందింది. ఫైనల్స్‌కు వెదుళ్ళపల్లి కొత్తపాలెం టీము, చిత్తూరు, రాజమండ్రి, హైదరాబాద్‌కు చెందిన ఆర్మీ టీములు పోటీలో ఉన్నాయి. బుధవారం సెమీఫైనల్స్, ఫైనాల్స్ మ్యాచ్‌లు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామని కమిటీ సభ్యులు ప్రకటించారు. పోటీల్లో మొత్తం 28 టీములు పాల్గొన్నాయి. -
వాలీబాల్ పోటీలు ప్రారంభం
బాపట్ల : క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం, దాతలు ముందుకు రావాలని వేగేశన ఫౌండేషన్ చైర్మన్ వేగేశన నరేంద్రవర్మరాజు కోరారు. బాపట్ల మండలం వెదుళ్ళపల్లి కొత్తపాలెం గ్రామంలో వేగేశన ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వాలీబాల్పోటీలను సోమవారం ఆట్టహాసంగా ప్రారంభించారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చిన జట్లును పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామపెద్దకాపు కోటా శ్రీరామిరెడ్డి, పెద్ది సుబ్రమణ్యం, కోటా వెంకటేశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు.