ఆ యువకుడు ఏమయ్యాడో ?
రేణిగుంట : రేణిగుంటలో ఓ ఎలక్ట్రికల్ దుకాణం యజమాని వినోద్(24) రోడ్డు ప్రమాదానికి గురై ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. ఏర్పేడులో నివాసముంటున్న అతను రేణిగుంటలో మంగళవారం రాత్రి దుకాణం మూసి ఏర్పేడుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యంలోని గురవరాజపల్లె సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి.
అయితే అతను ఏమయ్యాడో అంతుచిక్కలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.