బెంగళూరులో మరో చైనా స్మగ్లర్ అరెస్టు
కడప: ఎర్రచందనం డొంక లాగుతున్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల సంకెళ్లకు మరో చైనా చేప చిక్కింది. ఎర్రచందనం అక్రమ రవాణాలో మధ్య వర్తిత్వం నడుపుతున్న చైనా దేశీయుడు ఊకిన్ ఫాన్‌ను కపడ ఓఎస్డీ రాహుల్‌దేవ్ శర్మ ఆధ్వర్యంలో పోలీసులు బెంగళూరులోని కోరమండల్ సర్కిల్లో శనివారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 25 కిలోల ఎర్రచందనం, రూ.2.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం బెంగళూరులోనే చైనాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ ప్రేమ్తార్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విచారణలో అతడు వెల్లడించిన వివరాల ద్వారా పోలీసులు శనివారం ఊకిన్ ఫాన్‌ను అరెస్టు చేసినట్టు సమాచారం.