breaking news
Two robbers arrested
-
ప్రేమించి పెళ్లి చేసుకొని పోషించలేక..
శంషాబాద్: విలాసాల కోసం ఓ యువకుడు చోరీల బాటపట్టాడు.. ప్రేమించి పెళ్లి చేసుకుని కుటుంబాన్ని విలాసవంతంగా ఉంచాలనే ఉద్దేశంలో మరో వ్యక్తి అదే చోరీలను ఎంచుకున్నాడు.. వేర్వేరుగా చోరీలు చేసి జైలు పాలైన ఇద్దరు స్నేహితులుగా మారి సుమారు ఇరవైకి పైగా వరుస చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను షాద్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి... షాబాద్ మండలం చర్లగూడెం గ్రామానికి చెందిన బాసుపల్లి ప్రవీణ్(27) పదవతరగతి వరకు చదువుకున్నాడు. విలాసవంతంగా బతకడానికి చోరీలనే మార్గంగా ఎంచుకున్నాడు. షాద్‌నగర్, కొత్తూరు పోలీస్స్టేషన్ల పరిధిలో పలు చోరీలు చేసి జైలుకు వెళ్లాడు. ఇదే సమయంలో మహబూబ్‌నగర్ పట్టణ షషాబ్గుట్ట ప్రాంతంలో నివాసముండే వడ్డె శేఖర్( 28) స్థానికంగా ఫొటోగ్రాఫర్‌గా పనిచేసే వాడు. ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన అతడి ఆదాయం చాలకపోవడంతో పాటు విలాసవంతంగా బతికేందుకు చోరీలు చేయడం ప్రారంభించాడు. మహబూబ్‌నగర్ టౌన్‌తో పాటు కేశంపేట పరిధిలో పలు చోరీలకు పాల్పడి జైలుకెళ్లాడు. ప్రవీణ్, శేఖర్లు జైలులో స్నేహితులుగా మారారు. అక్కడి నుంచి వీరు మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 16 చోరీలకు పాల్పడ్డారు. దుకాణాల షట్టర్లు తొలగించడం చైన్ స్నాచింగ్, బైక్‌లు చోరీ చేయడం ప్రారంభించారు. రాచకొండ పరిధిలో ఒకటి, షాద్‌నగర్ 5 కేసులు నమోదయ్యాయి. సోమవారం షాద్‌నగర్‌లో చేపట్టిన వాహనాల తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించిన వీరిని షాద్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టి ఐదు ద్విచక్రవాహనాలు, 22.5 గ్రాముల బంగారం, 62 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. చోరీల్లో ప్రధాన నిందితుడైన ప్రవీణ్‌పై పీడీ యాక్టు నమోదు చేసేందుకు పరిశీలిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. కేసును ఛేదించిన షాద్‌నగర్ ఏసీపీ వి.సురేందర్, సీఐ సుధీర్‌కుమార్, డీఐ తిరుపతిని డీసీపీ ఈ సందర్భంగా అభినందించారు. -
ఆటోలు అపహరిస్తున్న దొంగల అరెస్టు
నిందితులు బావాబావమరుదులే మూడు ఆటోలు స్వాధీనం చిల్లకల్లు (జగ్గయ్యపేట) : రోడ్లపై, ఇళ్ల ముందు నిలిపి ఉంచిన ఆటోలను అపహరిస్తున్న ఇద్దరు దొంగలను మండలంలోని గరికపాడు ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద ఆదివారం రాత్రి పట్టుకున్నట్లు పేట సీఐ ైవె వీవీఎల్ నాయుడు తెలిపారు. సోమవారం చిల్లకల్లు పోలీస్ స్టేషన్లో ఆటోలసహా పట్టుకున్న దొంగలను విలేకరుల సమక్షంలో కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా కూచిపూడి గ్రామానికి చెందిన పోతురాజు సైదులు వ్యసనాలకు బానిసై కుటుంబంతో ఘర్షణలు తలెత్తండంతో రెండు వివాహాలు చేసుకున్నాడు. రెండో భార్య తమ్ముడు అయిన ఇబ్రహీపట్నం కొత్తూరుకు చెందిన బానావత్ దుర్గనాయక్‌తో చేతులు కలిపి ఆటోలు అపహరించుకుపోవడం మొదలు పెట్టారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో చిల్లకల్లులో ఆగి ఉన్న ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చింది. దీంతో కేసు విచారణ చేపట్టినట్లు సీఐ వివరించారు. అదేవిధంగాఇటీవల షేర్‌మహమ్మద్‌పేట, పెనుగంచిప్రోలులోనూ ఆటోలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులు అందడంతో కేసు దర్యాప్తును మరింత ముమ్మరం చేశామన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఇద్దరు వ్యక్తులు ఆటో స్పేర్ పార్టులను తీసుకువెళ్తుండగా అనుమానించి వారిని విచారించగా పలు విషయాలు వెలుగు చూశాయన్నారు. ఆటోలను అపహరించుకుపోయామంటూ నేరం ఒప్పుకున్నారని తెలిపారు. దొంగలించిన ఆటోల విడి భాగాలను కోదాడలో అమ్ముతుంటారని సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి రూ 3.30 లక్షల విలువైన మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును త్వరితగతిన చేదించిన ఐడీ పార్టీ సిబ్బందిని సీఐ అభినందించారు.ఈ సమావేశంలో ఎస్ఐ షణ్ముఖ సాయి, సిబ్బంది పాల్గొన్నారు.