breaking news
trains cancellation
-
మణిపూర్: బీజేపీ ఎమ్మెల్యేపై దాడి.. హెల్త్ కండిషన్ సీరియస్
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. తమకు షెడ్యూల్డ్ కులాల(ఎస్టీ) హోదా కల్పించాలని రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మైతీ వర్గం డిమాండ్ చేయడం అగ్గి రాజేసింది. దీంతో, గిరిజనులు భగ్గుమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఇళ్లు, దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రార్థనా మందిరాలపై దాడి చేశారు. గిరిజనేతరులతో ఘర్షణకు దిగారు. ఈ హింసాకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరోవైపు.. నిరసన సందర్భంగా రాష్ట్ర మంత్రి, బీజేపీ నేత ఉంగ్జాగిన్ వాల్టేపై నిరసనకారులు దాడికిపాల్పడ్డారు. కాగా, నిరసనకారుల దాడిలో ఉంగ్జాగిన్ వాల్టే తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తీవ్రంగా గాయపడిన వాల్టే ఇంఫాల్‌లోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక, ఉంగ్జాగిన్ వాల్టే.. కూకి తెగకు చెందిన వ్యక్తి. వాల్టే ఫెర్జావల్ జిల్లాలోని థన్లోన్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ప్రభుత్వంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. కాగా, గురువారం సెక్రటేరియట్లో సీఎం బీరేన్ సింగ్‌తో సమావేశమై తిరిగి తన అధికార నివాసానికి వెళ్తుండగా నిరసనకారులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. వాల్టేతోపాటు ఆయన డ్రైవర్‌ను విచక్షణారహితంగా కొట్టారు. కష్టంపై వాళ్లు అక్కడినుంచి బయటపడ్డారు. Tribal MLA Shri Vungzagin Valte attack by Meitei in Imphal today#TribalLivesMatter #ManipurOnFire @ndtv @AmitShah @ANI @KirenRijiju pic.twitter.com/hY4gpt8Kl2 — Lalsang H. (@lalsanghauzel) May 4, 2023 ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 55 పటాలాల సైన్యంతోపాటు అస్సాం రైఫిల్స్ జవాన్లను ప్రభుత్వం రంగంలోకి దించింది. మరో 14 పటాలాల సైన్యాన్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మణిపూర్‌లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ఆర్మీ అధికారులు తెలిపారు. భద్రతా బలగాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాయని చెప్పారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితుల నేపథ్యంలో మణిపూర్‌కు వెళ్లాల్సిన అన్ని రైళ్లను బోర్డర్లో నిలిపివేస్తున్నట్ట నార్త్ఈస్ట్ ఫ్రాంటీర్ రైల్వే వర్గాలు ట్విట్టర్ వేదికగా తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత రైళ్ల పునరుద్ధరణకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. Following the law & order situation in #Manipur, Northeast Frontier Railway has stopped all Manipur-bound trains. "No trains are entering Manipur till the situation is improved. The decision has been taken after the Manipur government advised to stop train movement, says… pic.twitter.com/nG9UWYbEVi — ANI (@ANI) May 5, 2023 ఇది కూడా చదవండి: ఎన్సీపీ అధినేత ఎవరవుతారో? -
కొనసాగుతున్న రైతుల రైల్‌రోకో
చండీగఢ్ : పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా పంజాబ్‌లో రైల్ రోకో ఆందోళన కొనసాగుతోంది. గత మూడు రోజులుగా రైతులు రైలు పట్టాలపై కూర్చొని రైల్ రోకోలు నిర్వహిస్తున్నారు. తొలుత కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ ఈ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే, ఆ తర్వాత వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. అమృత్‌సర్‌లో అన్నదాతలు చొక్కాలు విప్పి బిల్లులపై తమ నిరసనను తీవ్రంగా వ్యక్తం చేశారు. చొక్కాలు విప్పి రైలు పట్టాలపై కూర్చుంటే అయినా కేంద్రం తమ గోడు వింటుందని కిసాన్ కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వణ్ సింగ్ పాంధేర్ అన్నారు. రైతుల నిరసనలతో రైల్వే అధికారులు మరో మూడు రోజులు రాష్ట్రంలో అన్ని పాసింజర్ రైళ్లను రద్దు చేశారు. రైతులకి మద్దతుగా రండి: రాహుల్ పిలుపు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా శనివారం స్పీక్ అప్ ఫర్ ఫార్మర్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మోదీ ప్రభుత్వం రైతుల్ని అమాయకుల్ని చేసి దోపిడీ చేస్తోందని వారికి మద్దతుగా ప్రజలందరూ గళమెత్తాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడానికే వ్యవసాయ బిల్లుల్ని ఆమోదించారని ఆరోపించారు. -
తమిళనాడు నుంచి ఉత్తరాదికి వెళ్లే రైళ్లు రద్దు
చెన్నై : భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో తమిళనాడు నుంచి పుదుచ్చేరి, ఉత్తరాదికి వెళ్లే రైళ్లు నేడు రద్దు చేసినట్లు రైల్వే శాఖ బుధవారం వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే 27 రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొంది. భారీ వర్షాలతో రైల్వే ట్రాక్‌పైకి నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్ పాడైంది. నేడు చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, వేలూరు జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.