breaking news
with tractor
-
డచ్‌లో ట్రాక్టర్లతో రైతన్నలు...
డచ్ పార్లమెంట్లో సభ్యులు చేసిన ఆరోపణలు రైతన్నల గుండెల్లో తూటాల్లా పేలాయి. వారంతా ఆందోళన బాట పట్టి ప్రభుత్వాన్ని హడలెత్తించారు. దేశంలో పర్యావరణ కాలుష్యానికి, గాలిలో నైట్రోజన్ ఆక్సైడ్ శాతం పెరిగిపోవడానికి వ్యవసాయమే కారణమని కొందరు సభ్యులు పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. వారికి మద్దతుగా మరికొందరు గోశాలల్ని మూసివేయాలంటూ నినదించారు. దీంతో అన్నదాతల్లో ఆగ్రహం పెల్లుబుకింది. డచ్‌లో విమానాల పరిశ్రమ సర్వ అనర్థాలకు కారణమంటూ వారు మండిపడ్డారు. కానీ వారిని ఎవరూ నిందించడం లేదని తప్పుబట్టారు. రైతులు నిరసన వ్యక్తం చేయడానికి హేగ్‌కు వెళ్లే రహదారిని వేలాది ట్రాక్టర్లతో మోహరించారు. దాదాపుగా 1,136 కి.మీ. మేర ట్రాఫిక్‌జామ్ అయింది. ఇంచుమించుగా 3 వేల మంది వరకు రైతన్నలు ట్రాక్టర్లతో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. -
బైక్‌ను ఢీకొన్న ఇసుక ట్రాక్టర్
కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడు మృతి విద్యార్థికి స్వల్ప గాయాలు కారేపల్లి : బైక్‌ను ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడు మృతిచెందాడు. ఈ సంఘటన సింగరేణి సెక్యూరిటీ చెక్‌పోస్టు వద్ద గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రొంపేడు గ్రామానికి చెందిన ధర్మసోత్ రవి(27) ఇల్లెందులోని 24 ఇంక్లై¯ŒSలో గల మైనార్టీ గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ ఆర్ట్(డ్రాయింగ్) ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇదే పాఠశాలలో మాణిక్యారం గ్రామానికి చెందిన మెరుగు జ్ఞానేశ్వర్ 5వ తరగతి చదువుతున్నాడు. బాలుడికి వారం రోజులుగా జ్వరం వస్తుండటంతో ఇంటికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయినప్పటికీ తల్లిదండ్రులు స్పందించకపోవడంతో.. ఉపాధ్యాయుడు రవి బాలుడు జ్ఞానేశ్వర్‌ను తన బైక్‌పై ఎక్కించుకొని మాణిక్యారంలోని ఇంటి వద్ద దించేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇల్లెందు–ఖమ్మం ప్రధాన రహదారిపై ఓసీ సమీపంలోని సింగరేణి సెక్యూరిటీ చెక్‌పోస్టు వద్ద గుర్తు తెలియని ఇసుక ట్రాక్టర్ వెనక నుంచి వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో వెనక కూర్చున్న జ్ఞానేశ్వర్ రోడ్డు పక్కనే ఉన్న గడ్డిపై పడగా.. బైక్ నడుపుతున్న రవి రోడ్డుపై పడ్డాడు. వెంటనే ట్రాక్టర్ టైర్లు అతడి నడుము, తలపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. చుట్టుపక్కల వారు తేరుకునేలోపే ట్రాక్టర్ డ్రైవర్ వేగంగా అక్కడి నుంచి ఉడాయించాడు. విద్యార్థి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ డి.రమేష్, ఇల్లెందు సీఐ నరేందర్, కారేపల్లి ఎస్సై ఏ.కిరణ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని పంచనామాకు తరలించారు. మృతుడు రవికి భార్య భద్రమ్మ, రెండేళ్ల కొడుకు, 5 నెలల చిన్నారి ఉన్నారు. కాగా.. సంఘటనా స్థలంలో సహ ఉపాధ్యాయులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.