'టాప్ లెస్' సీన్లో ఆష్లే గ్రీన్
ట్విలైట్ స్టార్ ఆష్లే గ్రీన్ టాప్ లెస్తో వేడి పుట్టించింది. 'స్టేటెన్ ఐలాండ్ సమ్మర్' సినిమా కోసం అమ్మడు టాప్ లెస్‌గా నటించి అందరినీ అశ్చర్యంలోముంచెత్తింది. సన్ బాతింగ్ సీన్ కోసం ఈ ముద్దుగుమ్మ ఉదారంగా ఎద అందాలు ఆరబోసిందని అమెరికా మేగజీన్ ఒకటి వెల్లడించింది. 26 ఏళ్ల ఈ పడుచు అందం పల్చటి పసుపు రంగు బికినీ ధరించి టాప్ లెస్‌గా సీన్ పండించిందట. సహ నటులు విన్సెంట్ పాస్టోర్, గ్రహం ఫిలిప్ప్ సెట్లో ఉన్నా ఏ సంకోచం లేకుండా నటించిందట.
లైఫ్ గార్డ్స్‌గా ఉద్యోగాలు చేయాలనుకునే స్నేహితులు దాని కోసం ఏంచేశారనే కథతో 'స్టేటెన్ ఐలాండ్ సమ్మర్' తెరకెక్కుతోంది. 'సాటర్ డే నైట్ లివ్' రూపకర్త ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆష్లే గ్రీన్ టాప్ లెస్ అందాలు నిర్మాతకు బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు కాసులు కురిపిస్తాయే చూడాలి.