breaking news
Telugu film distributors
-
‘పూరీపై దాడి చేసినవారిని అరెస్టు చేయాలి'
హైదరాబాద్: సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం తెలుగు రాష్ట్రాల పూరీ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున కొందరు ఫిర్యాదు చేశారు. జగన్నాథ్ పై మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే తాము కూడా ప్రతీకార దాడులు చేయాల్సి వస్తుందంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లలో టికెట్ కౌంటింగ్‌ను కంప్యూటరైజ్ చేయాలని అందులో కోరారు. కొన్ని సినిమా థియేటర్లలో మల్టీప్లెక్స్ టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఇటువంటి వాటికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ త్వరలో సీఎం కేసీఆర్‌ను కలిసి కోరనున్నట్లు వెల్లడించారు. కాగా దర్శకుడు పూరి జగన్నాథ్ పై తాము దాడి చేయలేదని తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు. తమపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
పూరి జగన్నాథ్ పై డిస్ట్రిబ్యూటర్ల ఫైర్
హైదరాబాద్: దర్శకుడు పూరి జగన్నాథ్ పై తాము దాడి చేయలేదని తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు. తమపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులు సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పూరి జగన్నాథ్ పై తాము ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని అన్నారు. 'లోఫర్' సినిమా ఫ్లాప్ కావడంతో తమ డబ్బులు తిరిగివ్వాలని నిర్మాత చిల్లర కల్యాణ్ ను అడిగామని తెలిపారు. పూరి జగన్నాథ్ ఇంటికి వెళ్లలేదు, ఆయనతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. తమపై ఆరు సెక్షన్ల కింద ఏకపక్షంగా కేసులు నమోదు చేయడాన్ని వారు బట్టారు. పూరి జగన్నాథ్ పై దాడి చేశారని చెబుతున్న డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ ఆ రోజున హైదరాబాద్ లోనే లేరని వెల్లడించారు. ఇంత ఏకపక్షంగా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. నిజానిజాలు దర్యాప్తులో వెల్లడవుతాయన్నారు. సినిమా విజయవంతమయితే లాభాల్లో 20 శాతమే తమకు ఇస్తారని చెప్పారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు కనీసం 20 శాతం డబ్బులు వెనక్కు ఇవ్వాలని వేడుకుంటున్నామన్నారు. రజనీకాంత్, సూర్య, మహేశ్ బాబు తమ సినిమాలు ఫ్లాప్ అయినప్పడు డబ్బులు వెనక్కు తిరిగిచ్చేసిన విషయాలను వారు గుర్తు చేశారు. 'అఖిల్' విడుదలైన రెండో రోజే దర్శకుడు వివి వినాయక్ తమకు ఫోన్ చేసి 'మీ వెనుక నేనున్నాను' అంటూ భరోసా యిచ్చారని వెల్లడించారు. తాము కూడా సినిమా పరిశ్రమలో భాగమేనని, తమను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ లతో పాటు సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.