breaking news
telangana state agricultural university
-
వ్యవసాయ వర్సిటీ వీసీగా రఘునందన్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్ (వీసీ)గా వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు వ్యవసాయ వర్సిటీ వీసీగా పనిచేసిన ప్రవీణ్‌రావు ఈనెల 24న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఇన్చార్జి వీసీగా రఘునందన్‌రావు బాధ్యతలు స్వీకరించారు. పూర్తిస్థాయి వీసీ నియామకం జరిగే వరకు రఘునందన్‌రావు ఈ బాధ్యతల్లో ఉండనున్నారు. పూర్తిస్థాయి వీసీ పదవీ విరమణ చేసినపుడు వ్యవసాయ శాఖకు కమిషనర్‌గా ఉన్న వారే ఇన్చార్జి వీసీగా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలోనే రఘునందన్‌రావు ఈ బాధ్యతలు చేపట్టారు. -
చాంప్ రాజేంద్రనగర్ కాలేజి
ఇంటర్ కాలేజి స్పోర్ట్స్ సాక్షి, హైదరాబాద్: ఇంటర్ అగ్రికల్చరల్ కాలేజి స్పోర్ట్స్ మీట్లో రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల సత్తా చాటుకుంది. బాలుర విభాగంలో ఈ కాలేజి జట్టు విజేతగా నిలిచింది. బాలికల ఈవెంట్లో అశ్వరావు పేట అగ్రికల్చరల్ కాలేజి చాంపియన్‌షిప్ సాధించింది. ఇదే కాలేజికి చెందిన రాజేశ్ అథ్లెటిక్స్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ఐదు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8 వ్యవసాయ కాలేజీలకు చెందిన 550 మంది బాలబాలికలు పాల్గొన్నారు. మొత్తం 17 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్ర మానికి వర్సిటీ డీన్ కె.ఎస్. డాంగి, పాలకమండలి సభ్యులు మనోహర్ రావు, సురేందర్ రాజు, అసోసియేట్ డీన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇన్చార్జి ఫిజికల్ డైరెక్టర్ విద్యాసాగర్, శ్యామ్యూల్, మృణాళిని, సుజాత, చేరాలు తదితరులు పాల్గొన్నారు.