breaking news
Tarun yadav
-
ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు మృతి
బ్రహ్మంగారి మఠం: వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం మల్లేపల్లె చెరువులో ఈతకు దిగి చరణ్ (15), పార్థు (12), హర్ష (12), దీక్షిత్ (12), తరుణ్ యాదవ్ (10) మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి సెలవులు కావటంతో మల్లేపల్లెకి చెందిన ఉప్పలపాటి నారాయణ యాదవ్ ఇంటికి అతడి చెల్లెళ్లు సావిత్రి, భవాని హైదరాబాద్ నుంచి పిల్లలతో కలిసి వచ్చారు. గ్రామంలోని చెరువులో ఈత కొట్టాలని భావించిన భవాని పిల్లలు చరణ్, పార్థు, మరో చెల్లెలు సావిత్రి కుమారుడు హర్ష, మల్లేపల్లె గ్రామానికి చెందిన మేకల గంగాధర్ యాదవ్ కుమారుడు తరుణ్ యాదవ్, కాశినాయన మండలం మల్లేరు కొట్టాలకు చెందిన నారాయణ కుమారుడు దీక్షిత్ గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లారు. చీకటి పడినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో చెరువు వద్దకు వెళ్లారు. పిల్లల బట్టలు ఒడ్డున ఉండటం.. చుట్టూ ఎక్కడా పిల్లల జాడ కనిపించపోవడంతో చెరువులో పిల్లలు గల్లంతైనట్టు తెలుసుకుని గాలించారు. సమాచారం అందుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పోలీసులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత మృతదేహాలు లభ్యమయ్యాయి. మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ శివప్రసాద్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు. -
తరుణ్ యాదవ్కు టైటిల్
తెలంగాణ సబ్-జూనియర్ బాక్సింగ్ సిరీస్ ఎల్బీ స్టేడియం: తెలంగాణ సబ్-జూనియర్ బాక్సింగ్ సిరీస్ టోర్నమెంట్లో 28-30 కిలోల విభాగంలో తరుణ్ యాదవ్ (హైదరాబాద్) టైటిల్ చేజిక్కించుకున్నాడు. షేక్ షాజీబ్ (మెదక్)కు రెండో స్థానం లభించింది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (టీఎస్ఏ) సౌజన్యంతో తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలోని బాక్సింగ్ హాల్లో శనివారం ఈ పోటీలు జరిగాయి. ఇందులో విజేతలకు టేబుల్ టెన్నిస్ అర్జున అవార్డీ మీర్ ఖాసీమ్ అలీ ట్రోఫీలను అందజేశారు. వివిధ విభాగాల ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి. సబ్ జూనియర్ విభాగం: అండర్-16 బాలురు : 34-36 కేజీలు: 1.ఎం.డి.జాహిద్ (వరంగల్), 2. తవ్జ్యోత్ (హైదరాబాద్). 38-40 కేజీలు: 1. త్రిజ్యోత్ (హైదరాబాద్), 2. కె.సాయితేజ (రంగారెడ్డి). 42-44 కేజీలు: 1. క్లింటన్ డేవిడ్ (హైదరాబాద్), 2. పవన్ (రంగారెడ్డి జిల్లా). 46- 48 కేజీలు: 1.ఎం.పవన్ కుమార్ (హైదరాబాద్), 2. రాఖిల్ సాయి(ఆదిలాబాద్). 48-50 కేజీలు: 1.కె.యశ్వంత్ నాయక్ (మహబూబ్నగర్), 2.అబ్దుల్ సయ్యద్ (నిజామాబాద్). అండర్-13 బాలురు : 42-44 కేజీలు: 1.ఎం.వేణు (వరంగల్), 2. ఇమ్రాన్ ఖాన్ (హైదరాబాద్). అండర్-15 బాలురు: 42-44 కేజీలు: 1.బి.సతీష్ (ఆదిలాబాద్), 2. బి.కిషోర్(కరీంనగర్). అండర్-14 బాలురు: 40-42 కేజీలు: 1.ఎస్.నితిన్ రాజ్(హైదరాబాద్), 2.ఎం.ఆశోక్ (నిజామాబాద్).