breaking news
T JAC Chairman
-
రైతులను పట్టించుకోని ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పట్టెడన్నం పెట్టే అన్నదాతల విషయంలో ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నదని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. సాగుకోసం చేసిన అప్పులను కూడా తీర్చలేక అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ‘రైతు సమస్యలు– పరిష్కారాల సదస్సు’ పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జేఏసీ నేతలు, రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సంక్షోభాలను వివరించారు. అష్టకష్టాల కోర్చి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలేక సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు నుంచి పంట చేజారిపోగానే అమాంతం రేట్లు పెరిగిపోతున్నాయన్నారు. వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం ప్రకృతి వైఫల్యం వల్ల వచ్చినది కాదని, కేవలం మానవ నిర్మితమైనదన్నారు. విత్తనాలు, ఎరువులు ఇలా ప్రతీది కల్తీమయమవుతుందని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి ఇస్తున్న ప్రోత్సాహాల మాదిరిగా వ్యవసాయరంగానికి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విధిలేని పరిస్థితుల్లో వ్యవసాయం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వ్యవసాయరంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందని వనపర్తి జిల్లా జేఏసీ చైర్మన్ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. సాగుకు పెట్టుబడి లేక ఆవులు, దూడలను పెబ్బేర్ సంతలో అమ్ముకుంటున్నారన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు ఎలాంటి గిట్టుబాటు ఉండటం లేదన్నారు. విధిలేని పరిస్థితిలో వ్యవసాయం చేస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలిందన్నారు. రైతులకు తీరని నష్టం పత్తి విత్తనాల కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్ల మోసాల వల్ల గద్వాల జిల్లా రైతులు తీవ్రంగా మోసపోతున్నారని జిల్లా జేఏసీ చైర్మన్ నాగర్‌దొడ్డి వెంకట్రాములు ఆవేదన వ్యక్తంచేశారు. 20ఏళ్లుగా చేస్తున్న వారి అక్రమాలపై రైతులే స్వయంగా నడుంబిగించి పోరాటం చేయాల్సి వచ్చిందే తప్ప, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. సీడ్పంట ద్వారా ఎకరాకు రూ.5లక్షల దిగుబడి వస్తే కేవలం రైతుకు రూ.2లక్షలు అందజేసి, మిగతా మూడు లక్షలు కంపెనీలు, సీడ్‌ఆర్గనైజర్లు కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు. తుంగభద్రనది నుంచి న్యాయబద్దంగా రావాల్సిన వాటా 15.9టీఎంసీలను ఎందు కు రాబట్టడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, వివిధ మండలాల నుంచి పెద్దసంఖ్య లో రైతులు తరలివచ్చారు. ఆత్మç ßæత్య చేసుకున్న రైతులకు సంతాప సూచకంగా మౌనం పాటించారు. క్రియాశీలకంగా టీజేఏసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవసాయరంగానికి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మహబూబ్‌నగర్ జిల్లా జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచి ఉద్యమాలలో భాగస్వామ్యం చేయడంలో జేఏసీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందన్నారు. అందులో భాగంగానే ప్రభు త్వ వాగ్దానాలు అమలుచేయాలని జేఏసీ ఒక బాధ్యతతో డిమాండ్ చేస్తోం దని అన్నారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై 45రోజుల పాటు జేఏసీ సమగ్రంగా అధ్యయనం చేసిందని, ఆ నివేదికను కేంద్ర నాయకత్వానికి అందజేశామన్నారు. ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సదస్సులో ఒక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. -
టీఆర్ఎస్ పాలనపై కోదండరాం వ్యాఖ్యలు
-
డీజీపీని కలిసిన ప్రొ కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మతో టీ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం ఆధ్వర్యంలో సభ్యుల బృందం శుక్రవారం డీజీపీ కార్యాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో హోంగార్డుల సమస్యలుపై డీజీపీతో ఆయన చర్చించారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీజీపీకి కోదండరాం విజ్ఞప్తి చేశారు. అలాగే చాలా కాలంగా కొనసాగుతున్న ఆర్డర్లీ వ్యవస్థను కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా డీజీపీని కోదండరాం కోరారు. -
సంపూర్ణ తెలంగాణ సాధన కోసం మరో ఉద్యమం
హైదరాబాద్: హైకోర్టు, ఉద్యోగుల విభజనపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కేంద్ర ప్రభుత్వంపై టి.జేఏసీ ఛైర్మన్ కోదండరాం మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో కోదండరాం మాట్లాడుతూ... విభజన జరిగి ఏడాది దాటినా రాష్ట్ర పరిస్థితులను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సంపూర్ణ తెలంగాణ సాధన కోసం మరో ఉద్యమం చేస్తామని కోదండరాం స్పష్టం చేశారు. అందుకోసం త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై దృష్టి పెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. విభజన సమస్యలపై మంత్రిత్వశాఖను ఏర్పటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.