breaking news
swetha naagu
-
అరుదుగా కనిపించే శ్వేత నాగు.. చూసేందుకు ఎగబడ్డ జనం
వనపర్తి: పట్టణంలోని కమలానగర్ కాలనీలో బుధవారం తెల్లని నాగుపాము(శ్వేతనాగు) కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు సాగర్స్ స్నేక్ సొసైటీ నిర్వాహకులు చీర్ల కృష్ణసాగర్ అక్కడికి వెళ్లి పామును పట్టుకున్నారు. అరుదుగా కనిపించే తెల్ల నాగుపాము (శ్వేతనాగు)ను చూసేందుకు ప్రజలు ఎగబడ్డారు. సైన్స్ ప్రకారం తన్యులోపం వల్ల తెల్లని వర్ణంలో పాములు ఉంటాయని నిపుణులు తెలిపారు. శ్వేతనాగును అచ్చంపేట అటవి ప్రాంతంలో వదిలేస్తామని సొసైటీ నిర్వాహకులు తెలిపారు. -
స్నేక్ కిరణ్‌ని కాటేసిన శ్వేతనాగు
-
స్నేక్ కిరణ్‌ని కాటేసిన శ్వేతనాగు
శివమొగ్గ : ఎలాంటి పామునైనా చాకచక్యంగా బంధించే స్నేక్ కిరణ్‌ను శ్వేతనాగు (తెల్ల నాగుపాము) కాటేసింది. శివమొగ్గ సమీపంలోని న్యూ మండ్లీ లే ఔట్ వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న లే ఔట్లో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద షెడ్లో శ్వేతనాగు ఉన్నట్లు సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఫోన్ సమాచారం అందుకున్న స్నేక్ కిరణ్ హుటాహుటిన అక్కడకు చేరుకున్నాడు. పది నిమిషాల్లో దానిని అతను బంధించి, తన వద్ద ఉన్న సీసం బాటిల్లోకి వేసే సమయంలో మెరుపు వేగంతో వెనక్కు తిరిగి అతని కుడిచేతిపై కాటు వేసింది. పామును బాటిల్లో వేసి, తన స్నేహితుల సాయంతో సమీపంలోని కువెంపు నగర్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చేరుకున్నాడు. అప్పటికే పరిస్థితి విషమించి అపస్మారకస్థితికి అతను చేరుకున్నాడు. వైద్యులు అతన్ని ఐసీయూ ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అరుదైన పాము తెల్ల రంగులో ఉండే నాగుపాములు చాలా అరుదుగా ఉంటాయని, వీటిని పట్టుకునే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు పేర్కొంటున్నారు. అత్యంత వేగవంతంగా కదిలే స్వభావమున్న ఈ పాములు అతి సూక్ష్మమైన స్వభావాన్ని కలిగి ఉంటాయని తెలిపారు.