breaking news
Suresbabu
-
షార్ట్ ఫిల్మ్ తీయబోతే...?
‘‘మంచి సినిమాలకెప్పుడూ ఆదరణ ఉంటుంది. ఈ చిత్ర నిర్మాత వరుణ్ మా కజిన్ . ‘ముసుగు’ అనే సినిమా పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉండగానే, కొత్త చిత్రం ప్రారంభించడంతో నాకు ఆశ్చర్యమేసింది’’ అని నిర్మాత సురేశ్‌బాబు పేర్కొన్నారు. శ్రీనివాస రెడ్డి, ధీరేంద్ర, ప్రవీణ్, బిందు బార్బీ, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రల్లో వేద ఎంటర్ప్రైజెస్ పతాకంపై శ్రీకరబాబు దర్శకత్వంలో దగ్గుబాటి వరుణ్ నిర్మిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాత అశోక్ కుమార్ కెమెరా స్విచ్చాన్ చేయగా మరో నిర్మాత టి. ప్రసన్న కుమార్ క్లాప్ కొట్టారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ కళాశాల నేపథ్యంలో జరిగే కథ ఇది. షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ కోసం వైజాగ్ వెళ్లిన విద్యార్థులకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయనే సస్పెన్స్ అంశం చుట్టూ ఈ చిత్రం నడుస్తుంది’’ అన్నారు. దర్శకుడు, నటుడు రాంబాబు, సంగీత దర్శకుడు అమోఘ్ దేశ్‌పతి, పాటలు, మాటల రచయిత ‘గంగోత్రి’ విశ్వనాథ్ మాట్లాడారు. -
ఘనంగా గాంధీ జయంతి
ఇందూరు: ప్రభుత్వ కార్యాలయాలలో గురువారం గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ, ప్రధాని మోడీ ఆదేశాల మేరకు ‘స్వచ్ఛ భారత్’ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గాంధీజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా పరిషత్‌లో జడ్పీ సమావేశ మందిరంలో, జిల్లా పంచాయ తీ కార్యాలయంలో డీపీఓ సురేశ్‌బాబు గాంధీజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అ ర్పించారు. ఉద్యోగులందరిచే స్వచ్ఛ భారత్ ప్ర తిజ్ఞ చేయించి, గాంధీ జీవిత చరిత్రను వివరిం చారు. అనంతరం ఉద్యోగులు కార్యాలయ పరి సర ప్రాంతాలలో ఉన్న చెత్తను, పిచ్చి మొక్కల ను, గడ్డిని శుభ్రం చేశారు. ఇందులో జడ్పీ ఉ ద్యోగులు సాయన్న, సాయిలు, డీపీఓ ఏఓ రా జేంద్రప్రసాద్, లక్ష్మారెడ్డి, ప్రభాకర్, సిద్ధిరాము లు, అరుణ్‌కుమార్, కృష్ణ, మంజుల తదితరులు పాల్గొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యాలయంలో ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి గాంధీ చిత్ర పటానికి పూ ల మాలలు వేసి నివాళులు అర్పించారు. స్వచ్ఛ భారత్ నిర్మాణానికి కృషి చేస్తామని ఉద్యోగుల చే ప్రతిజ్ఞ చేయించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, పాఠశాలలలో, అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్ల నిర్మాణం, మురుగు కాలువలు, చెత్త ని ర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అ వగాహన కలిగించాలని ఉద్యోగులకు సూచిం చారు. 2019 నాటికి స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ భారత్‌గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కా ర్యాలయ ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఘ నంగా నిర్వహించారు. ఐసీడీఎస్ ఆవిర్భావ ది నోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ పీడీ రాములు గాంధీ చిత్ర ప టానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించా రు. స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు. ఉద్యోగులు కార్యాలయం పరిసరాలను శుభ్రం చేశారు. టీడీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గాంధీచౌక్‌లో గాంధీ విగ్రహానికి ఎమ్మెల్సీ అరికె ల నర్సారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అ ర్పించారు. టీడీపీ నగర అధ్యక్షుడు రత్నాకర్, రాజమల్లు, తదితరులు పాల్గొన్నారు.