breaking news
Support centers
-
అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్!
కృత్రిమమేధ(ఏఐ) ఉద్యోగుల పాలిట శాపంగా మారుతుంది. వివిధ కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగుల కార్యకలాపాల స్థానంలో ఏఐని వాడడం ప్రారంభించాయి. దాంతో ఆయా స్థానాల్లోని ఉద్యోగులను తొలగిస్తున్నాయి. థర్డ్‌పార్టీ ఆన్లైన్ పేమెంట్ సేవల సంస్థ ఫోన్‌పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ కార్యకలాపాల్లో 90 శాతం ఏఐ చాట్బాట్లను వినియోగిస్తోంది. దాంతో గత ఐదేళ్లలో 60 శాతం ఉద్యోగులను తొలగించింది. గతంలో ఈ విభాగంలో ఉన్న 1,100 మంది ఉద్యోగులను 400కు కుదించింది.ఫోన్‌పే అక్టోబర్ 21న విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం..గత ఐదేళ్లలో కస్టమర్ సపోర్ట్ విభాగంలో 90 శాతం ఏఐ చాట్‌బాట్‌ను వినియోగిస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 వరకు లావాదేవీలు 40 రెట్లు పెరిగాయి. కొవిడ్ 19 పరిణామాల వల్ల గతంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నా ఆటోమేషన్ విధానం కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. దానివల్ల ప్రస్తుతం కంపెనీ రెవెన్యూ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కస్టమర్ సంతృప్తికి పెద్దపీట వేస్తూ, అదే సమయంలో గణనీయంగా ఖర్చు ఆదా చేసేలా పని చేస్తోంది. గత పదేళ్లలో కస్టమర్ నెట్ ప్రమోటర్ స్కోర్ (ఎన్పీఎస్-కస్టమర్లు కంపెనీ అందించే సేవల వల్ల సంతృప్తి పొందడం) పెరుగుతోందని కంపెనీ తెలిపింది.కంపెనీ వార్షిక నివేదికలో తెలియజేసిన వివరాల ప్రకారం కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఉద్యోగుల సంఖ్య 400కు చేరింది. ఇది గతంలో 1,100గా ఉండేది. ఈ విభాగంలో 90 శాతం ఏఐను వినియోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దేశం అంతటా సంస్థలో దాదాపు 22 వేల ఉద్యోగులున్నట్లు పేర్కొంది. 1,500 కంటే ఎక్కువ మంది అగ్రశ్రేణి ఇంజినీర్లకు కంపెనీ ఉపాధి కల్పిస్తోందని చెప్పింది. ఫోన్‌పే ఆగస్టులో తెలిపిన వివరాల ప్రకారం మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.5,064 కోట్ల ఆదాయం సమకూరినట్లు నివేదించింది. ఇది అంతకుముందు సంవత్సరంలో రూ.2,914 కోట్లగా నమోదైంది. అంటే ఏడాదిలో 74 శాతం వృద్ధిని సాధించినట్లయింది.ఇదీ చదవండి: పెళ్లి చేసే కుటుంబాలకు ధీమా.. వివాహ బీమాఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కస్టమర్ సర్వీస్ విభాగంలో ఇలా ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య అధికంగా ఉంటుందన్నారు. అయితే ఏఐకు శిక్షణ ఇచ్చే విభాగంలో సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత ఉందని చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే సర్వీస్ విభాగంలో పని చేస్తున్నవారు నిరాశ పడకుండా తమ రంగంలో ఏఐకు శిక్షణ ఇచ్చే నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. దాంతో ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయినా భవిష్యత్తులో మెరుగైన నైపుణ్యాలు సాధన చేస్తే మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
తెలంగాణ మహిళలకు 'భరోసా'
హైదరాబాద్ : విపత్కర పరిస్థితుల్లో ఉన్న మహిళలు, పిల్లలకు అన్ని విధాలా సహాయం అందించేందుకు హైదరాబాద్ నగర పోలీసులు ఏర్పాటుచేసిన ‘భరోసా’ కేంద్రం తెలంగాణ మహిళలకు భరోసాను కలిగిస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హకాభవన్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటుచేసిన భరోసా కేంద్రాన్ని డీజీపీ అనురాగశర్మతో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే మహిళలు, అమ్మాయిలను వేధించే ఈవ్టీజర్ల ఆటకట్టించేందుకు షీ టీమ్స్ సమర్థంగా పనిచేస్తున్నాయని తెలిపారు. అయితే బాధితులైన, వేధింపులకు గురవుతున్న స్త్రీలు, పిల్లల్లో మనోస్థైర్యం నింపడంతో పాటు వారి జీవితంపై నమ్మకాన్ని కలిగించేందు కోసం నగర పోలీసులు ‘భరోసా’ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. మతసామరస్యాన్ని కాపాడుతూ శాంతిభద్రతలకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్న తెలంగాణ పోలీసులకు దేశస్థాయిలో మంచి పేరు వచ్చిందన్నారు. ప్రతి ఠాణాకో కౌన్సిలర్, లీగల్ అడ్వైజర్: డీజీపీ మహిళలకు పూర్తిస్థాయిలో భద్రత కలిగించడంతో పాటు పోలీసు శాఖలోనూ మహిళా సిబ్బందిని పెంచాల్సిన అవసరముందని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. షీ టీమ్స్ విజయవంతమైన తర్వాత అటువంటి అధికారుల కోసం వెతికితే సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీన్ని సీఎం కేసీఆర్‌కు వివరించి ప్రతి ఠాణాలో మహిళా సిబ్బంది ఉండాలని కోరితే అందుకనుగుణంగానే 33 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు. మహిళలకు ఆపన్నహస్తం అందించేందుకు ఏర్పాటుచేసిన 'వన్ స్టాప్ సెంటర్' భరోసా తొలి అడుగేనని అన్నారు. నగరంలో ఇది పూర్తిస్థాయిలో విజయవంతమైతే ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేగాకుండా ప్రతి ఠాణాలో ఒక కౌన్సిలర్, లీగల్ అడ్వైజర్ ఉండాలనే ఆలోచన చేస్తున్నామని, వీరిని అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకురావాలనుకుంటున్నామని తెలిపారు. ఇలా చేయడం వల్ల మారుమూల గ్రామాల్లోని మహిళలకు త్వరగా న్యాయం జరుగుతుందన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది మాట్లాడుతూ.. మహిళల పట్ల మగాళ్ల ఆలోచన విధానంలో మార్పు వస్తే ఇటువంటి సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ‘ఈ భరోసా కేంద్రంలో బాధితులకు చట్టం, న్యాయం, వైద్యం, పునరావాస సేవలు అందిస్తాం. భరోసా కేంద్రంలో అడుగుపెట్టినప్పటి నుంచి బాధితుడికి న్యాయం అందేంత వరకు పూర్తి స్థాయిలో మా సహకారం ఉంటుంది' అని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, మహిళ,శిశు సంక్షేమ కార్యదర్శి జగదీశ్వర్, హైదరాబాద్ నగర క్రైమ్స్ అండ్ సిట్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా, తరుణి స్వచ్ఛంద సంస్థ స్థాపకురాలు మమతా రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.