breaking news
Superstar Aamir Khan
-
'ఆ సీన్ చూస్తూ కళ్ల వెంట నీళ్లొచ్చేశాయి'
ముంబయి: సోనమ్ కపూర్‌పై బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె చాలా ప్రతిభ గల హీరోయిన్ అని, ఆమె నటించిన నీరజా సినిమాతో తానెంటో రుజువు చేసుకుంటుందని చెప్పారు. మరికొద్ది రోజుల్లో సోనమ్ నటించిన నీరజ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో అమీర్ మీడియాకు సోనమ్ గురించి, ఆమె చిత్రం గురించి కొన్ని కబుర్లు చెప్పారు. నీరజా సినిమా ఈ వారంలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సినిమాలో సోనమ్ కపూర్‌కు షబానా ఆజ్మీ అమ్మగా నటించిందని, ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు. ముఖ్యంగా సోనమ్ గురించి చెబుతూ ఈ సినిమా చివరి భాగంలో తాను చాలా భావోద్వేగానికి లోనయ్యానని, కళ్ల వెంట నీళ్లు కూడా వచ్చాయని, ఇది గొప్ప సినిమా అవుతుందని అన్నారు. నీరజ సినిమాను పాన్ ఎమ్ 73 విమానాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు కరాచీలో హైజాక్ చేసిన సంఘటన ఆధారంగా చిత్రీకరించారు. ఒక మహిళా సిబ్బంది తన ప్రయాణికులను కాపాడుకునేందుకు చూపించిన తెగువ అద్భుతంగా తెరకెక్కించారు. 'ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాం మద్వానీ నాకు మంచి స్నేహితుడు. అతను ఎంతో టాలెంట్ ఉన్న దర్శకుడు. ఈ సినిమా యదార్థంగా జరిగిన సంఘటన. హైజాక్ చేసినప్పుడు ప్రయాణికులను కాపాడిన అమ్మాయి(సోనమ్) నిజంగా చాలా తెలివైనది. ప్రతిఒక్కరికీ ఈ సినిమా స్పూర్తినిస్తుంది' అని అమీర్ అన్నారు. నిజ జీవితంలో తాను కూడా కొన్ని సమయాల్లో భయానికి లోనవుతుంటానని ఆయన చెప్పారు. ముఖ్యంగా తన కుటుంబం గురించే ఎక్కువ భయంగా ఉంటుందని నా భార్య, పిల్లలు బయటకు వెళ్లినప్పుడు వారు తిరిగి ఇంటికి వచ్చేంతవరకు ఆందోళన పడుతుంటానని అమీర్ అన్నారు. -
రేపు తెరపైకి ఐదు సినిమాలు
* లింగా చిత్రం విడుదలై రెండు వారాలు పూర్తి కాలేదు. దాని ఫీవర్ తగ్గిందనే ప్రచారం జరుగుతున్నా ఈ వారం తెరపైకొచ్చిన బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ చిత్రం పీకే హవా కొనసాగుతూనే ఉంది. ఇంతలో క్రిస్మస్ పండుగ వచ్చేసింది. దీంతో ఈ పండుగ సందర్భంగా ఐదు తమిళ చిత్రాలతోపాటు ఒక తెలుగు, మరొక ఆంగ్ల చిత్రం విడుదలకు సిద్ధమైపోతున్నాయి. అవేమిటో, వాటి వివరాలు చూసేద్దామా? క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 25న కయల్, వెళ్లక్కారదురై, మెగామాన్, కప్పల్, ఎండ్రుమ్ ఆనందం వంటి ఐదు తమిళ చిత్రాలతోపాటు తెలుగు చిత్రం చిన్నదాన నీ కోసం, ఆంగ్ల చిత్రం నైట్ ఎట్ ది మ్యూజియం విడుదలకు సిద్ధం అవుతున్నాయి. * ప్రభుసాల్మన్ కయల్ వీటిలో మైనా, కుంకి చిత్రాల సృష్టికర్త ప్రభుసాల్మన్. తాజా సెల్యులాయిడ్ కయల్ క్రిస్మస్ బరిలోకి దిగుతోంది. నటి ఆనంది టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో నవ నటుడు హీరోగా నటించారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన కయల్ చిత్రాన్ని గాడ్ పిక్చర్స్ సంస్థ నిర్మించగా ఎస్కేప్ ఆర్టిస్ట్ మోషన్ పిక్చర్స్ అధినేత ఎస్.మదన్ విడుదల చేస్తున్నారు. * రెండో చిత్రం వెళ్లక్కార దురై విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య జంటగా నటించిన ఈ చిత్రానికి ఎస్.ఎళిల్ దర్శకుడు. జిఎన్ అన్భళగన్ నిర్మాతగా మారి గోపురం ఫిలింస్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ఇది. ఈ చిత్రానికి డి.ఇమాన్నే సంగీత బాణీలు కట్టారు. * మూడో చిత్రం మెగామాన్. ఆర్య, హన్సిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మగిళ్ తిరుమణి దర్శకుడు. నేమ్‌చంద్ జపక్, ఎ.హిందేష్ జపక్ నిర్మించిన ఈ చిత్రంలో ఆర్య యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. * నాలుగో చిత్రం కప్పల్. వైభవ్ సోనం బాజ్వా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా శంకర్ శిష్యుడు కార్తీక్ జి.క్రిష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇది వినోదంతో కూడిన ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ తన ఎస్.పిక్చర్స్ పతాకం ద్వారా విడుదల చేస్తున్నారు. * ఐదో చిత్రం ఎండ్రుమే ఆనందం. మహేంద్రన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి వివేక్ భారతి దర్శకుడు. అణై సుగుణ సినీ ఆర్ట్స్ సమర్పణలో నార్గవి టాకీస్ సంస్థ నిర్మించింది. * వీటితోపాటు నితిన్ హీరోగా నటించిన చిన్నదాన నీ కోసం చిత్రం, నైట్ ఆఫ్ ది మ్యూజియం అనే ఆంగ్ల చిత్రం తెరపైకి రానున్నాయి.