breaking news
Subhash Deshmukh
-
భారీగా దొరికిన పెద్దనోట్లు, చిక్కుల్లో మంత్రి
-
భారీగా దొరికిన పెద్దనోట్లు, చిక్కుల్లో మంత్రి
ముంబై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేశాక ఆ పార్టీకే చెందిన ఓ మంత్రి ఇరకాటంలో పడ్డారు. 91 లక్షలా 50 వేల రూపాయల విలువైన 500, 1000 రూపాయల నోట్లను మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు దొరికిన ఈ నగదు తనదేనని ఆ రాష్ట్ర సహకార శాఖ మంత్రి సుభాష్ దేశ్‌ముఖ్ చెప్పారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఈ డబ్బు తన వద్ద ఉంచుకున్నట్టు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న అకస్మాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేశారన్నారు. తాను ఈ డబ్బును అక్రమంగా దాచుకోలేదని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రి చెప్పారు. సోలాపూర్‌లో మంత్రికి చెందిన ఎన్జీవో వాహనంలో డబ్బును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయం తెలియగానే ప్రజలు షాకయ్యారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పెద్ద మొత్తంలో 500, 1000 రూపాయల నోట్లను గుర్తించామని, డబ్బుతో పాటు వాహనాన్ని సీజ్ చేసినట్టు ఉస్మానాబాద్ కలెక్టర్ ప్రశాంత్ నార్నవేర్ ధ్రువీకరించారు. ఈ డబ్బును జిల్లా ట్రెజరీలో డిపాజిట్ చేసినట్టు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేయాలని పోలీసులకు, ఐటీ అధికారులకు సూచించినట్టు తెలిపారు. ఈ మొత్తం తమదని, ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి తీసుకెళ్తున్నట్టు తొలుత లోక్ మంగళ్ గ్రూప్ ఉద్యోగి చెప్పారు. కాగా రోజు తర్వాత అంటే శుక్రవారం మంత్రి దేశ్‌ముఖ్ స్పందిస్తూ ఈ డబ్బు తనదేని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికో లేదా అక్రమంగా దాచుకున్నదో కాదని చెప్పారు. ఆయనపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి మంత్రి పదవి నుంచి దేశ్‌ముఖ్‌ను తొలగించాలని కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ముందే బీజేపీ నాయకులకు లీక్ చేశారని ఆరోపించారు. -
ఆ మాజీ ఎంపీ ప్రచారానికి 4వేల అల్లుళ్లు, కూతుళ్లు!
ఎప్పుడో పురాణాల్లో వందలాది కుటుంబ సభ్యులు యుద్దాల్లో పాల్గొన్నారని చరిత్ర పాఠ్యాంశంలో చదువుకున్నాం. కాని పురాణాల్లో కాకుండా తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఓ ఆసక్తిని రేకెత్తించే అంశం ఓటర్లను ఆకర్షిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో దక్షిణ సోలాపూర్ నియోజకవర్గంలో బీజేపీ తరపున సుభాష్ దేశ్ ముఖ్ పోటి చేస్తున్నారు. ఈ మాజీ ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆయన తరపున 4 వేల మంది కూతుళ్లు, అల్లుళ్లు చెమటోడుస్తున్నారు. అయితే ఈ రోజుల్లో వేలాది మంది కూతుళ్లు ఎలా ఉన్నారనే సందేహం కలుగడం సహజమే. లోక మంగళ్ గ్రూప్ అనే స్వచ్చంద సేవా సంస్త ద్వారా గత ఏడేళ్లలో 2 వేల మంది యువతులకు దేశ్ ముఖ్ సామూహిక వివాహాలు జరిపించారు. పేద కుటుంబాల్లో ఎవరూ అప్పుల బారిన పడకుండా ఆ కుటుంబాలకు చెందిన యువతులకు ప్రతి నవంబర్ లో సామూహిక వివాహాలను జరిపించే కార్యక్రమంలో దేశ్ ముఖ్ నిమగ్నమయ్యారు. వివాహంతోపాటు బట్టలు, నిత్యావసర వస్తువులతోపాటు ఆ దంపతులకు అమ్మాయి పుడితే 5 వేల రూపాయలను కూడా దేశ్ ముఖ్ ఇస్తుంటారు. ఇలా రెండు వేల సామూహిక వివాహాల జరిపించడం ద్వారా ప్రస్తుతం నాలుగు వేల మంది కూతుళ్లు, అల్లుళ్లు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి దిలీప్ మానే వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.