breaking news
Sub Collectorate
-
మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం
సాక్షి రాయచోటి/బి.కొత్తకోట/మదనపల్లె/సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఆదివారం అర్థరాత్రి అగి్నప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏఓ ఛాంబర్ కుడివైపు సెక్షన్లు పూర్తిగా.. ఎడమవైపు సెక్షన్లు కొంతమేర దగ్థమయ్యాయి. అలాగే, వీటికి ఎదురుగా ఉన్న విభాగాలూ మొత్తం కాలిపోయాయి. ఈ విభాగాల్లోని రికార్డులు, కంప్యూటర్లు దగ్థమయ్యాయి. తీవ్రస్థాయిలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. దీనిపై సోమవారం సీఎం చంద్రబాబు అత్యవసర విచారణకు ఆదేశించారు. ఘటనపై కలెక్టర్ చామకూరి శ్రీధర్‌ను ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ఉన్నపళంగా హెలికాప్టర్లో మదనపల్లెకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దాదాపు మూడు గంటలకు పైగా జరిపిన తనిఖీల్లో ఏపీఎస్పీడీసీఎల్, ఫోరెన్సిక్ ల్యాబ్, పోలీస్, రెవెన్యూ అధికారుల ద్వారా ప్రమాదానికి గల కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోష్‌రావు విద్యుత్ సరఫరా వైర్లు, మీటరు, ఇతర విద్యుత్ పరికరాలను పరిశీలించారు. విద్యుత్ సరఫరా వైరింగ్ కొన్నిచోట్ల కాలిపోయినట్లు గుర్తించారు. అలాగే, సీఐడీ, ఇంటెలిజెన్స్, శాంతిభద్రతల విభాగం, పోలీసు అధికారులూ విచారణ జరిపారు. ప్రమాదంపై విద్యుత్ శాఖాధికారులు, తహశీల్దార్లు, ఉద్యోగులనూ విచారించారు. అంతేకాక.. ఈ ఘటనపై విచారణకు పది బృందాలను ఏర్పాటుచేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్‌పై దృష్టిపెట్టారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి డాగ్‌స్కా్వడ్‌లు.. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి ఫోరెన్సిక్ విభాగం నిపుణులను రప్పించారు.అధికారుల హడావుడితో హైటెన్షన్.. అంతకుముందు.. సోమవారం ఉదయమే పోలీసులు కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని కొద్దిమంది అధికార పార్టీ నేతలు, ఎల్లో మీడియా ప్రతినిధులను మినహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఇక అగి్నప్రమాదంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఆవరణకు చేరుకోవడం.. ఎక్కడలేని హడావుడి నెలకొనడంతో సబ్‌కలెక్టరేట్ చుట్టుపక్కల హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై చర్చించుకునేందుకు ఎవరూ సాహసించడంలేదు. ఎవరితో ఏం మాటా్లడితే ఏం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు.అవసరమైతే కేసు సీఐడీకి బదిలీ: డీజీపీ అనంతరం.. డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ.. అగి్నప్రమాదంపై వీఆర్ఏ డీటీకి తెలపడం, ఆమె ఆర్డీఓకి చెప్పడం.. ఆయన ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు మంటలను అదుపుచేశారన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. అవసరాన్ని బట్టి సీఐడీకి కేసు బదిలీచేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. రెవెన్యూ శాఖలోని 25 అంశాలకు చెందిన రన్నింగ్ ఫైల్స్ దగ్థమైనట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. అలాగే, దగ్థమైన రికార్డులకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటర్ల నుంచి తిరిగి పునరుద్ధరిస్తామని వెలగపూడి సచివాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. -
సబ్‌కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్: నేరారోపణలపై పోలీసులు విచారణకు తీసుకెళ్లిన తన కుమారుడి ఆచూకీ లేదని పేర్కొంటూ స్థానిక పీఅండ్‌టీ కాలనీకి చెందిన జమ్రుద్బేగం సబ్‌కలెక్టరేట్‌లో శనివారం ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న సబ్‌కలెక్టర్ వెట్రిసెల్వి అక్కడికి చేరుకుని మహిళను నిలువరించారు. సమస్య ఏమిటో చెప్పకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంపై మందలించారు. బాధితురాలు మాట్లాడుతూ తనకు ముగ్గురు కొడుకులు ఉన్నారని తెలిపింది. చిన్న కొడుకు హుస్సేన్ ఆర్ఆర్ స్ట్రీట్‌లోని శ్రీనివాసులు వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడని పేర్కొంది. నెలక్రితం దుకాణంలో జరిగిన దొంగతనంలో హుస్సేన్ ప్రమేయముందని పేర్కొంటూ వన్‌టౌన్ పోలీసులు అతన్ని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారని తెలిపింది. పదిరోజుల తర్వాత తిరిగి పోలీసులు ఇంటికి వచ్చి రెండో కుమారుడు నయాజ్‌ను విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకురావాలని చెప్పడంతో తానే]∙స్వయంగా తీసుకెళ్లానని చెప్పింది. తన కళ్లెదుటే కొడుకును కానిస్టేబుళ్లు నరేష్, సుకుమార్ విపరీతంగా కొట్టారని వాపోయిం ది. ‘నీ కొడుకు తర్వాత వస్తాడుపో’ అని చెప్పారని, రెండు రోజులైనా తన కొడు కు ఇంటికి రాలేదని కన్నీంటి పర్యంతమైంది. స్టేషన్లో విచారిస్తే వెళ్లిపోయాడని, రెండు, మూడు రోజుల్లో వస్తాడని పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని వాపోయింది. 20 రోజులైనా తన బిడ్డ కనిపించకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్యకు యత్నించాల్సి వచ్చిందని బోరుమంది. స్పందించిన సబ్‌కలెక్టర్ వెంటనే డీఎస్సీ రాజేంద్రప్రసాద్, సీఐ నిరంజన్‌కుమార్, ఎస్ఐ సుకుమార్, కానిస్టేబుల్ నరేష్‌ను పిలిపించి విచారించారు. దొంగతనం విషయమై పిల్లలిద్దరినీ స్టేషన్‌కు పిలిపించిన మాట వాస్తవమేనని తెలిపారు. విచారణ తర్వాత ఇంటికి పంపేశామని చెప్పారు. దొంగతనం బయటపడితే ఎక్కడ డబ్బులు కట్టాల్సి వస్తుందోనన్న భయంతో ఆత్మహత్య నాటకాలు ఆడుతోందని చెప్పారు. రెండో కుమారుడి అదృశ్యంపై తమకు ఎలాంటి ప్రమేయం లేదని వివరణ ఇచ్చారు. మహిళ మాత్రం తనకు న్యాయం చేసేంతవరకు వెళ్లేది లేదని మొండికేయడంతో పరిష్కారం కోసం డీఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లారు.