breaking news
sri indu engineering college
-
హెచ్ఓడీ తిట్టాడని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
రంగారెడ్డి: కళాశాల భవనంపై నుంచి దూకి ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా శనివారం వెలుగుచూసింది. ఇబ్రహీంపట్నంలో షేర్గూడలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో వెంకట చైతన్య అనే విద్యార్థి మెకానికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ రోజు కళాశాల భవనం మూడో అంతస్థు పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కాళ్లు, చేతలు, తలకు తీవ్ర గాయాలైన అతన్ని ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. హెచ్ఓడీ మందలించడం వల్లే చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు అంటున్నారు. ఈ రోజు ఉదయం తండ్రితో పాటు కళాశాలకు వచ్చిన చైతన్య కొద్దిసేపటికే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం కామినేని ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. -
’కాలేజీ యాజమాన్యమే నా బిడ్డను హత్య చేసింది’