breaking news
SP GR Radhika
-
గురి తప్పకూడదు..
శ్రీకాకుళం: పోలీసు వృత్తిలో ఫైరింగ్ నైపుణ్యం కీలకమని ఎస్పీ జీఆర్ రాధిక అన్నారు. ఎచ్చెర్ల సమీపంలోని చినరావుపల్లిలోని ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఫైరింగ్ రేంజ్లో మంగళవారం వార్షిక ఫైరింగ్ సాధన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి అధునాతన ఆయుధం గురించి తెలుసుకోవాలని సూచించారు. -
బాగున్నావా అవ్వా..!
శ్రీకాకుళం (వజ్రపుకొత్తూరు): బాతుపురం పంచాయతీ పెదవంక గ్రామానికి చెందిన మావోయిస్టు నేత చెల్లూరి నారాయణరావు(ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో ఉన్నారు) కుటుంబ సభ్యులను ఎస్పీ జి.ఆర్.రాధిక కలిశారు. వజ్రపుకొత్తూరు మండలంలో మంగళవారం పర్యటించిన ఆమె రాజాంలో ఉంటున్న నారాయణరావు తల్లి నీలమ్మను కలిసి అవ్వా.. నీ అరోగ్యం ఎలా ఉందంటూ ఆప్యాయంగా పలకరించారు. కుటుంబ నేపథ్యం, ప్రస్తుత జీవన విధానం అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని, అవసరమైన చికిత్స అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కుటుంబ సభ్యులకు పోలీసులు ఉండగా ఉంటారని, ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించాలని సూచించారు. అనంతరం కొంత నగదు, పండ్లు అందజేశారు. ఆమెతో పాటు కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి, కాశీబుగ్గ సీఐ డి.రాము, ఎస్సై కూన గోవిందరావు తదితరులు ఉన్నారు. -
మహిళలు నిర్భయంగా చెప్పుకోవాలి
ఆదిలాబాద్ క్రైం : మహిళలు వారి సమస్యలను పోలీసులకు నిర్భయం గా చెప్పుకోవాలని అదనపు ఎస్పీ (పరిపాలన) జీఆర్ రాధిక అన్నారు. సోమవారం స్థానిక పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగంలో అర్జీలు స్వీకరించారు. జిల్లా వ్యా ప్తంగా 14 మంది అర్జీ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మహిళల భద్రత కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా 100, 1091కు ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుంటారన్నారు. జిల్లా వ్యాప్తంగా షీ టీం లు ఏ ర్పాటు చేసి అన్ని చోట్ల సిబ్బందిని నియమించామన్నారు. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్ ప్రాంతాల్లో షీ టీంల నిఘా అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఫిర్యాదుల విభాగం అధికారి శివాజీ చౌహాన్, జైస్వాల్ కవిత, జగదీశ్, కార్యాలయ అధికారులు ఫారుఖ్, అత్తాఉల్లాఖాన్ ఉన్నారు. పోటీలను సద్వినియోగం చేసుకోవాలి ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థపై పోలీసు శాఖ నిర్వహించే ఫొటో, వీడియో షార్ట్ ఫిల్మ్ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని ఏఎస్పీ జీఆర్ రాధిక పేర్కొన్నారు. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని పోలీసులు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. వారి సేవలు ప్రతిబింబించేలా పోటీల్లో చిత్రా లు, వీడియో ప్రదర్శనకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మంగళవారంతో గడువు ముగుస్తుందని, పోలీసు పీఆర్వో గురుదేవ్‌కు నేరుగా ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలన్నారు. 14న విజేతలు ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు సెల్‌నెం. 9440900673కి సంప్రదించాలన్నారు. ఆదివాసీ చట్టాలకు భంగం కలిగితే ఉద్యమం ఉట్నూర్ : అన్ని రంగాల్లో అత్యంత వెనుకబాటును అనుభవిస్తున్న ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చట్టాలు రూపొందించబడ్డాయని, వాటికి భం గం కలిగితే ఆదివాసీ గిరిజనులమంతా ఏకమై ఉద్యమం చేపడుతామని ఆది వాసీ గిరిజన సంఘాల నాయకులు సిడం శంభు, కుడిమెత తిరుపతి, నేతవత్ రాందాస్, బానోత్ రామారావ్, సర్దార్, రాజేందర్ స్పష్టం చేశారు. సోమవా రం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగంలోని చట్టాల్లో మార్పులు తీసుకురావాలని కుట్ర చేస్తే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ను అవమానించినట్లేనని అన్నారు. గిరిజనేతరుల మధ్య భూములు క్రయవిక్రయా లు జరిగితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఏజెన్సీ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి దోచుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.