breaking news
Sinusitis problem
-
ప్రెగ్నెంట్ టైంలో సైనసైటిస్ మందులు వాడితే ప్రమాదమా..?
నేను మూడు నెలల గర్భవతిని. నాకు ఎప్పటినుంచో డస్ట్ అలెర్జీ, సైనసైటిస్ సమస్యలు ఉన్నాయి. గర్భం వచ్చిన తర్వాత తరచూ జలుబు, తుమ్ములు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని మందులు వాడాను. ఈ మందులు నా బిడ్డకు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఆందోళనగా ఉంది. గర్భధారణ తొలి నెలల్లో మందులు వాడటం సురక్షితమా? నేను ఏవైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా?– సుశీల, నాగర్కర్నూల్సుశీల గారు, గర్భధారణ తొలి నెలల్లో శరీరంలో రక్షణశక్తి, హార్మోన్లలో మార్పులు ఎక్కువగా జరుగుతాయి. అందుకే ఈ సమయంలో జలుబు, తుమ్ములు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు రావడం సాధారణం. కొన్నిసార్లు ఫ్లూ కూడా రావచ్చు. ఈ లక్షణాలు ఎప్పుడు వస్తే, వాటి కారణం ఏమిటో ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చికిత్స కారణాన్ని బట్టి మారుతుంది. ఇలాంటి సమయంలో ముందుజాగ్రత్తలు చాలా సహాయపడతాయి. ముఖ్యంగా ఫ్లూ సీజన్లో ఎక్కువ జనసమూహాలు ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం, అలెర్జీ కలిగించే పదార్థాలను తీసుకోకపోవటం, అవసరమైతే మాస్క్ ధరించడం మంచిది. ఫ్లూ వ్యాక్సిన్ గర్భధారణలో ఎప్పుడైనా సురక్షితంగా తీసుకోవచ్చు. ఇది తల్లికి, బిడ్డకు రక్షణ ఇస్తుంది. తేలికపాటి జలుబు, సైనసైటిస్ ఉన్నప్పుడు ఎక్కువగా నీరు తాగడం, వేడి సూపులు తాగడం, ఇంట్లో ఆవిరి పీల్చడం లాంటి చిట్కాలు ఉపశమనాన్ని ఇస్తాయి. మీ శరీర ఉష్ణోగ్రత, పల్స్, ఆక్సిజన్ స్థాయిలను ఇంట్లోనే ఉంటూ గమనించడం మంచిది. లక్షణాలు ఎక్కువైనా లేదా ఏదైనా అసాధారణంగా అనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మొదటి మూడు నెలల్లో మందులు వాడడంపై మీరు ఆందోళన పడుతున్నా, నిపుణుల సూచనలో ఇచ్చే తేలికపాటి చికిత్సలు సాధారణంగా సురక్షితమే. ఇవి బిడ్డ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవు. సమయానికి వైద్య పర్యవేక్షణ, జాగ్రత్తలు పాటిస్తే గర్భధారణలో జలుబు, తుమ్ములు, ఫ్లూ వంటి సమస్యలు సులభంగా నియంత్రించుకోవచ్చు.నాకు ఈ మధ్యనే రెండవ ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయింది. అయితే, నా మొదటి గర్భధారణలో నాకు తీవ్రమైన వాంతులు అయ్యాయి. పలుసార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. శారీరకంగా, భావోద్వేగపరంగా చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే, ఇప్పుడు ఈ గర్భధారణను కొనసాగించడానికి భయం వేస్తోంది. ఈ గర్భధారణలో కూడా నాకు మళ్లీ అలాంటి వాంతులు వస్తాయా? వాంతులు తగ్గించుకోవడానికి నేను ఏమి చేయగలను?– కీర్తి, వరంగల్గర్భధారణ సమయంలో వాంతులు, వికారం సాధారణంగా కనిపించే సమస్య. దీనిని ‘మార్నింగ్ సిక్నెస్’ అంటారు. ఇది ఎక్కువగా మొదటి త్రైమాసికంలో కనిపిస్తుంది. సాధారణంగా ఆరు నుంచి ఏడవ వారంలో ప్రారంభమై, పదనాలుగు నుంచి పదహారు వారాల మధ్య తగ్గిపోతుంది. అయితే ఈ లక్షణాల తీవ్రత వ్యక్తికి వ్యక్తికి వేరుగా ఉంటుంది. కొందరికి స్వల్పంగా మాత్రమే ఉండగా, మరికొందరికి చాలా తీవ్రమైన, రోజువారీ జీవితాన్ని ఇబ్బందిపెట్టేంతగా వాంతులు రావచ్చు. మీరు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరడం, ఇంజెక్షన్స్, మెడిసిన్స్ తీసుకోవడం కూడా అవసరమవుతుంది. ఒకే మహిళకు వేర్వేరు గర్భధారణల్లో వాంతుల తీవ్రత వేరుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం గర్భధారణ హార్మోన్ అయిన బీటా హెచ్‌సీజీ స్థాయి అకస్మాత్తుగా పెరగడం. అందుకే కవలలు గర్భంలో ఉన్నప్పుడు వాంతులు మరింతగా వస్తాయి. వాంతులు తగ్గించుకోవడానికి మీరు పాటించగల కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండాలి, ప్రతి రెండు నుంచి మూడు గంటలకు తక్కువ మోతాదులో అయినా తరచు ఆహారం తీసుకోవాలి. మృదువైన, సులభంగా జీర్ణమయ్యే పదార్థాలను తినడం మంచిది. మసాలా వంటకాలకు, బయట ఆహారానికి వీలైనంత దూరంగా ఉండాలి. ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు. వాంతులు ఎక్కువగా వస్తున్నప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. కొన్ని వాసనల వల్ల వాంతులు పెరిగే అవకాశం ఉన్నందువలన అలాంటి వాసనల నుంచి దూరంగా ఉండాలి. అల్లం, నిమ్మరసం వంటి పదార్థాలను ఆహారంలో చేర్చడం కూడా కొంత ఉపశమనం ఇస్తుంది. వాంతులు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని మందులు సురక్షితంగా వాడవచ్చు. ఇవి మీ డాక్టర్ సూచనతో మాత్రమే తీసుకోవాలి. మీరు ఏమీ తినలేకపోతున్నా లేదా తాగలేకపోతున్నా, బరువు తగ్గడం లేదా డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నా వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. సమయానికి చికిత్స తీసుకోవడం వల్ల మీకు, శిశువుకు కలిగే సంక్లిష్టతలను తగ్గించవచ్చు. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: కంటి ఆరోగ్యం కోసం 20:20:20 రూల్ వెబ్సైట్..!) -
సైనసైటిస్‌తో బాధపడుతున్నారా? లక్షణాలు ఎలా ఉంటాయి?
సైనసైటిస్ వ్యాధి దీర్ఘకాలం బాధిస్తుంది. ముక్కు లోపలి భాగాల్లో ఉండే గాలి గదులను సైనస్ అని అంటారు. ఈ సైనస్‌లు ఇన్ఫెక్షన్కు గురికావడం వల్ల సైనసైటిస్ వస్తుంది. ముక్కుకు ఇరువైపులా నుదురు, కళ్ల చుట్టూ నొప్పులు ఉంటాయి. జలుబు, తలనొప్పి, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలతో చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. సైనస్‌ను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల మందులు వాడినా పెద్దగా ఫలితం ఉండదు. అలాంటి వారు సహజసిద్ధ పద్ధతులతో సైనస్‌ను ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. నవీన్ నడిమింటి మాటల్లో తెలుసుకుందాం. అక్యూట్ సైనసైటిస్‌లో ముక్కు కారడం, ముఖంలో ఒత్తిడి, నొప్పి, వాసన గ్రహించే శక్తి తగ్గడం లాంటి లక్షణాలు ఉంటాయి. ఇది నాలుగు వారాల్లోగా తగ్గుతుంది. సాధారణ జలుబు వల్ల ఈ సమస్య వస్తుంది. పదే పదే సైనసైటిస్ రావడం వల్ల అది క్రానిక్ గా మారుతుంది. ఇది 12 వారాల వరకు ఉంటుంది. సాధారణంగా దీనికి బ్యాక్టీరియా కారణం అవుతుంది. ముక్కు కారుతూ, ముఖ భాగాల్లో నొప్పి ఉండి, పది రోజుల వరకు లక్షణాలు తగ్గకపోతే అది బ్యాక్టీరియా వల్ల వచ్చిన సైనసైటిస్ కావొచ్చు. "సైనసైటిస్ అనేది చాలా రకాల కారణాల నుంచి వస్తుంది. కాలుష్యం, వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల సైనసైటిస్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వీటితో పాటు అలర్జీ వల్ల కూడా దీని బారిన పడే ప్రమాదం ఉంది. ముక్కులో ఎముక వంకరగా ఉన్నా, పిల్లల్లో ఎడినాయిడ్ సమస్య ఉన్నా సైనసైటిస్ రావొచ్చు. డయాబెటిస్తో బాధపడేవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వారు దీని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. షుగర్ వ్యాధితో బాధడేవారికి ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా త్వరగా వస్తాయి" అని ప్రముఖ ఈఎన్టీ వైద్యులు, డాక్టర్ సి.ఆంజనేయులు చెప్పుకొచ్చారు. సైనస్ లక్షణాలు ఇలా ఉంటాయి.. సైనస్ లక్షణాలు ఎలా ఉన్నాయి? అవి ఎంత కాలం నుంచి ఉన్నాయి? అనే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. జలుబు, అలర్జీలను తగ్గించే ముందులు, ముక్కు దిబ్బడను తగ్గించే డీ-కంజెస్టెంట్స్ను వాడటం ద్వారా ముక్కు రంధ్రాలను శుభ్రం చేయడంతో సైనస్ బాధలు తగ్గుతాయి. సైనస్‌తో బాధపడేవారు దాన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. సైనస్ లక్షణాలను త్వరగా గుర్తించి, చికిత్స చేయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. నేసల్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కులో ఏదైనా అనాటామికల్ సమస్య ఉందేమో తెలుసుకోవాలి. సీటీ స్కాన్ ద్వారా సైనస్ ఇన్ ఫ్లమేషన్‌ను తెలుసుకొని చికిత్స చేయించుకోవాలి. సైనస్‌తో బాధపడేవారు వ్యాయామం లాంటివి చేస్తూ దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇలాంటి వాళ్లకు ఆవిరి పట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చిక్కగా ఉండే శ్లేష్మం పలుచగా మారుతుంది. వేడినీళ్లతో స్నానం చేయాలి. 1.స్నానం చేసే నీళ్లలో యూకలిప్టస్ నూనెను కలపడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది. 2.చక్కటి ప్రశాంతమైన నిద్ర అవసరం.. విశ్రాంతి తీసుకోవడం వల్ల వైరస్, బ్యాక్టీరియాతో పోరాడే తెల్ల రక్తకణాలను మన శరీరం మరింత ఎక్కువగా ఉత్పత్తి చేయగలుగుతుంది. 3. తల కింద దిండ్లను పెట్టుకొని తల,ఛాతీ భాగం పైకి ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల సైనస్లో ద్రవాలు పేరుకుపోకుండా ఉంటాయి. 4. నీళ్లు, ఇతర ద్రవాలను ఎక్కువగా తాగాలి. 5. శారీరక వ్యాయామాల వల్ల రక్తప్రసరణ మెరుగై ముక్కు దిబ్బడ తగ్గుతుంది. 6. సైనసైటిస్ అంటువ్యాధి కానప్పటికీ.. దానికి కారణమైన బ్యాక్టీరియా, వైరస్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. 7. నీలగిరి తైలం,జీవన ధార తైలం తో Inhalation చేస్తే త్వరగా తగ్గుతుంది. 8. పసుపుకొమ్మును నిప్పుల్లో కాల్చి పీలిస్తే కూడా ముక్కు దిబ్బడ తగ్గుతుంది. 9. దాల్చిన చెక్క పొడి: 5 gr,మిరియాల పొడి : 5 gr,యాలకుల గింజల పొడి:5 gr,జీలకర్ర పొడి :5 gr.. ఇలా పొడులను కలిపి మూడు వేళ్ళతో పట్టుకొని నశ్యం లాగా పీలిస్తే ముక్కు దిబ్బడ వెంటనే తగ్గుతుంది. 10. జాజి కాయను మెత్తగా పొడి చేసి గంధం లాగా చేసి పాలలో కలుపుకొని తాగాలి. 11. పసుపు పొడి: అర టీ స్పూను,వెల్లుల్లి ముద్ద :పావు టీ స్పూను.. రెండింటిని కలిపి తీసుకుంటే జలుబు ద్వారా వచ్చే గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది. 12. శొంటి, పిప్పళ్ళు, మిరియాలు.. మూడింటిని విడివిడిగా దోరగా వేయించి దంచి చూర్ణాలు చేసుకోవాలి.ఈ పొడిని పావు టీ స్పూను లేదా అర టీ స్పూను వరకు తీసుకుంటే ఫ్లూ వల్ల వచ్చే జలుబు తగ్గుతుంది. 13. మిరియాల పొడి,యాలకుల పొడి,నల్ల జిలకర పొడి.. అన్ని పొడులను కలిపి నిల్వ చేసుకోవాలి. దీనిని పీలిస్తే ముక్కు దిబ్బడ, జలుబు కూడా తగ్గుతాయి 14. కొబ్బరి నూనెను వేడి చేసి దానిలో కర్పూరం వేసి కరిగించి ముక్కు మీద ,గొంతు మీద చాతీ మీద , మెడ మీద , పక్కటెముకల మీద పూసి బాగా మర్దన చేయాలి . ఈ విధంగా చేయడం వలన జలుబు అప్పటికప్పుడు తగ్గిపోతుంది. -
సైనస్ లక్షణాలు ఇవే .. సర్జరీ చేసినా తగ్గకపోతే ఏం చేయాలి
-
అసలే చలికాలం..సైనసైటిస్‌కు ఈ జాగ్రత్తలు తీసుకుందాం..
ప్రస్తుత చలి వాతావరణం సైనసైటిస్కి అత్యంత అనుకూలించే సీజన్. అంతేకాదు అస్తవ్యస్త వాతావరణ పరిస్థితులు కూడా. ఎండగా ఉండాల్సిన రోజుల్లో వర్షం, వర్షాకాలంలో ఎండ.. మధ్యాహ్నం సమయంలో చల్లని గాలులు... ఇటీవల అన్నీ ఇలాంటి చిత్ర విచిత్ర వాతావరణ పరిస్థితులే చూస్తున్నాం. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అత్యధికులు ఎదుర్కొంటున్న సర్వ సాధారణ ఆరోగ్య సమస్య సైనసైటిస్. ఈ నేపధ్యంలో హైదరాబాద్, కొండాపూర్‌లో ఉన్న అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ ఇఎన్‌టి డాక్టర్ మహమ్మద్ నజీరుద్దీన్ సైనసైటిస్‌కు లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నారిలా... శ్వాస..ఇన్ఫెక్షన్... సైనసైటిస్ అనేది సైనస్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్. ఇది సైనస్ లైనింగ్ కణజాలంలో వాపు కారణంగా ఏర్పడుతుంది. సైనస్‌లు సన్నని శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది ముక్కు మార్గాల ద్వారా బయటకు వస్తుంది. ఇదే ముక్కును శుభ్రంగా, ఇన్ఫెక్షన్ లేకుండా ఉంచుతుంది. ఈ సైనస్‌లు సాధారణంగా గాలితో నిండినప్పుడు, ద్రవంతో నిండినప్పుడు, సైనసైటిస్‌కు దారితీసే ఇన్ఫెక్షన్లకు లోనుకావడం జరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్ ఎవరికైనా రావచ్చు కానీ అలర్జీలు, ఉబ్బసం మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు తరచుగా సైనస్ ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు. కొన్ని లక్షణాలు: ► దట్టమైన రంగు మారిన ద్రవంతో ముక్కు నుంచి స్రావాలు ► ముఖం నొప్పి 10 రోజులకు మించి ఉండడం ► ముక్కు మూసుకుపోవడం లేదా మూసుకుపోవడం వల్ల ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ► కళ్ళు, బుగ్గలు, చెవులు, తల, పై దవడ మరియు దంతాల చుట్టూ నొప్పి, సున్నితత్వం, వాపు ► వాసన మరియు రుచి తగ్గినట్టు అనిపించడం ► గొంతు నొప్పి, నోటి దుర్వాసన, అలసట కారణాలు ► సైనసైటిస్ సాధారణంగా వైరస్, బాక్టీరియా లేదా ఫంగస్ వల్ల వస్తుంది, ► సాధారణ జలుబు వల్ల సైనస్‌లు ఉబ్బి ఇన్ఫెక్షన్లకు దారితీసినప్పుడు సైనసైటిస్‌కు దారి తీస్తుంది. ► కాలానుగుణ అలెర్జీలు పుప్పొడి లేదా ధూళి వంటి అలెర్జీ కారకాలకు శరీరం లోనైనప్పుడు సైనస్‌లు ఉబ్బి, సైనసైటిస్‌కు దారితీసే మార్గాన్ని అడ్డుకుంటుంది. ► ధూమపానం సైనస్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది, పొగాకు పొగ నాసికా వాయుమార్గాలను చికాకుపెడుతుంది, తద్వారా శరీరం మరింత శ్లేష్మం ఉత్పత్తి చేస్తుంది, దీని వలన అలెర్జీలు లేదా జలుబు సైనసైటిస్‌కు దారితీసే అవకాశం ఉంది. చికిత్స ► సైనసైటిస్ తీవ్రతను బట్టి వివిధ పద్ధతులలో చికిత్స చేయవచ్చు. డీకోంగెస్టెంట్లు, సెలైన్ ద్రావణంతో నాసికా నీటిపారుదల, యాంటీబయాటిక్స్, పుష్కలంగా నీరు త్రాగడం వంటివి ఈ ఇన్ఫెక్షన్స్కు ప్రాథమిక చికిత్సగా చెప్పొచ్చు. ► దీర్ఘకాలిక/క్రానిక్ సైనసైటిస్ కోసం అలెర్జీలు. ఇంట్రానాసల్ స్టెరాయిడ్ స్ప్రేలు, ఓరల్ హిస్టామిన్ మాత్రలు, యాంటిహిస్టామైన్ స్ప్రేలు చికిత్సలో భాగంగా వైద్యులు సూచిస్తారు. ► అదనపు మందులను కలిగి ఉండే సెలైన్ సొల్యూషన్స్ ఉపయోగించి చేసే నాసికా ప్రక్షాళన కూడా సైనస్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి సమర్థవంతమైన సాధనం. ► వేరే చికిత్సలు ఏవీ ఇన్ఫెక్షన్స్ నియంత్రించడంలో విజయవంతం కానప్పుడు సమస్యను పరిష్కరించడానికి శస్త్రచికిత్స... తర్వాత ఇఖీ స్కాన్ చేయబడుతుంది. నివారణ ప్రధానం.. ► తగినంత అవగాహన, ముందస్తు జాగ్రత్తలతో సైనసైటిస్‌ను నివారించవచ్చు. జలుబు లేదా ఇ¯Œ ఫెక్ష¯Œ లతో అనారోగ్యంగా ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని వదులుకోవాలి. –భోజనానికి ముందు చేతులు తరచుగా సబ్బుతో కడుక్కోవాలి. ► వైద్యుల సూచనలు పాటించడం ద్వారా తమకేవైనా అలర్జీలు ఉంటే వాటిని అదుపులో ఉంచుకోవాలి. ► ఊపిరితిత్తులు, నాసికా భాగాలకు చికాకు కలిగించే, మంటను కలిగించే పొగాకు పొగ వంటి కాలుష్య కారకాలకు గురికాకూడదు. పైన పేర్కొన్న లక్షణాలతో పాటు, ఏవైనా ఇతర అసాధారణతలు గమనించినట్లయితే తక్షణ నిపుణుల సంప్రదింపులు అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేది శరీరం నుండి అవాంఛిత టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. –డాక్టర్ మహమ్మద్ నజీరుద్దీన్ఇఎన్టి అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ -
సైనసైటిస్ అంటువ్యాధి కాదు
ఈఎన్టీ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. చాలాకాలంగా సైనసైటిస్ సమస్య ఉంది. ఇటీవల నాకు చాలా ఎక్కువగా తలనొప్పి వస్తోంది. ఇది నాకు ఎవరి నుంచైనా వ్యాపించిందేమో అనిపిస్తోంది. ఇది వాస్తవమేనా? నాకు తగిన సలహా ఇవ్వండి. - విజయ్‌కుమార్, నల్లగొండ మీరు చెప్పిన అంశాలను బట్టి మీకు దీర్ఘకాలిక సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. మీరు, మీ ఫ్రెండ్స్ అనుకుంటున్నట్లుగానే సైనస్ ఇన్ఫెక్షన్ పట్ల మనలో చాలా అపోహలు ఉన్నాయి. వాటి గురించి ఉన్న కొన్ని అపోహలూ, వాస్తవాల గురించి ఒక చిన్న పట్టిక ఇది... అపోహ: సైనసైటిస్‌తో పాటు తలనొప్పి తప్పక వస్తుంటుంది. వాస్తవం: నిజానికి చాలా తక్కువ సందర్భాల్లోనే సైనసైటిస్‌తో పాటు తలనొప్పి వస్తుంటుంది. అయితే చాలామంది సైనసైటిస్ ఉన్నవారికి వచ్చేవారికి మైగ్రేన్ తలనొప్పి తప్పక వస్తుందనుకుంటారు. నిజానికి మైగ్రేన్, టెన్షన్ తలనొప్పి ఈ రెండూ వేరు. సైనస్ సమస్య ఉన్నవారికి తప్పక మైగ్రేన్ వస్తుందనేది ఒక తప్పుడు అభిప్రాయమే. సైనస్ లేకపోయినా మైగ్రేన్ లేదా టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పులు కనిపించవచ్చు. అపోహ: సైనస్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాస్తవం: నిజానికి సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి కలిగే జలుబు వంటి కండిషన్ వల్ల మీకు ఈ అపోహ ఏర్పడి ఉండవచ్చు. కానీ సైనస్ ఇన్ఫెక్షన్ ఎంతమాత్రమూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సాంక్రమిక వ్యాధి కాదు. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. అయితే సాధారణ జలుబు (కామన్ కోల్డ్) వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంటుంది. అపోహ: సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రతివారూ తప్పక యాంటీబయాటిక్స్ వాడాలి. వాస్తవం: సైనస్ ఇన్ఫెక్షన్స్ అన్నీ బ్యాక్టీరియా వల్ల కాకపోవచ్చు. కేవలం సైనస్లలో బ్యాక్టీరియా చేరినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. ఒకవేళ సైనస్లలో వైరల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే, వాటికి యాంటీబయాటిక్స్ వాడినా ప్రయోజనం ఉండదు. కాబట్టి సైనస్ ఇన్ఫెక్షన్ ఏ రకానికి చెందినది అన్న అంశాన్ని బట్టే మందులూ వాడాల్సి ఉంటుంది. మీది నిర్దిష్టంగా ఏ సమస్య అన్నది కనుగొని, దానికి తగినట్లుగా మందులు తీసుకుంటే, మంచి ఫలితం ఉంటుంది. మీరు వెంటనే ఈఎన్టీ నిపుణులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. - డా॥శ్రీనివాస్ కిశోర్ సీనియర్ ఈఎన్టీ, హెడ్ అండ్ నెక్ సర్జన్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్