breaking news
silk road
-
హాలీవుడ్‌కు హాయ్
‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండ దోస్త్‌గా కనిపించి హీరో బెస్ట్ ఫ్రెండ్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు రాహుల్ రామకృష్ణ. ఆ తర్వాత ‘భరత్ అనే నేను’ ‘గీత గోవిందం’ ‘హుషారు’ సినిమాల్లో మంచి మార్కులు వేయించుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’లో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్‌కు హాయ్ చెప్పడానికి రెడీ అయ్యారు. ‘సిల్క్ రోడ్’ అనే చిత్రం ద్వారా హాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు రాహుల్. ‘‘ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాతో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ప్రదీప్ తెలుగు వాడు కావడం విశేషం. -
హిందూ మహాసముద్రం కోసమే చైనా కయ్యం
బీజింగ్ : భారత్-చైనాల మధ్య డోక్లాం తరువాత దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎన్ఎస్జీ, ఒన్‌బెల్ట్ ఒన్‌రోడ్, వంటి వివాదాలు ఇరు దేశాల మధ్య ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో చైనా సంబంధాలను మరీ బలోపేతం చేసుకోవడం కూడా భారత్‌ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య హిందూమహాసముద్రం వేదికగా మరిన్ని కొత్త వివాదాలు ఏర్పడనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్, చైనా మధ్య హిమాలయాలకంటే అధికంగా హిందూ మహాసముద్రమే వివాదాలకు, ఒకరకంగా చెప్పాలంటే యుద్ధానికి కూడా కారణమవుతుందని చైనాకు చెందిన ప్రముఖ విశ్లేషకుడు బ్రెర్టిల్ లిన్టర్ చెబుతున్నారు. బ్రెటిల్ తాజాగా రచించిన ‘చైనాస్ ఇండియా వార్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అందులో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలను కలుపుతూ చైనా నిర్మిస్తున్న ఒన్‌బెల్ట్ ఒన్‌రోడ్, సిల్క్ రోడ్లు ఇందుకు కారణంగా మారే అవకాశం ఉందని ఆయన అన్నారు. సముద్రంపై చైనా అసక్తి చైనా దాదాపు 60 ఏళ్లుగా హిందూ మహాసముద్రంపై పట్టు సాధించలేదు. అయితే ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంతో పాటు.. హిందు మహాసముద్రంపై చైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే హిమాలయాలకన్నా.. చైనాకు ఇప్పుడు హిందూమహాసముద్రమే చాలా విలువైంది. 1959లో యుద్ధం జరగాల్సింది! భారత్‌పై చైనా 1959లోనే యుద్ధం చేయాలని భావించినట్లు ఆయన తన పుస్తకంలో తెలిపారు. అయితే భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ.. సరిహద్దు సమస్యలపై చైనాతో చర్చించడంతో యుద్ధాన్ని వాయిదా వేసుకుంది. అయితే 1962లో మాత్రం చైనా యుద్ధానికి దిగింది. -
అది ఆధిపత్య మార్గం!!
►ఆర్థిక, రాజకీయ ఆధిపత్యమే చైనా నవీన సిల్క్రోడ్లక్ష్యం ►నాలుగు ఖండాల్లో 68 దేశాలను కలుపుతూ సుదీర్ఘ మార్గాలు ►దేశంలో మిగులు ఉత్పత్తికి కొత్త మార్కెట్ల అన్వేషణలో భాగం ► చైనా పాక్ఎకానమిక్కారిడార్పై భారత్తీవ్ర అభ్యంతరం ► దానివల్ల భారత సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు భంగం సిల్క్‌రోడ్! ఇప్పుడు అంతర్జాతీయంగా చాలా ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. ప్రపంచ వేదిక మీద.. ముఖ్యంగా ఆసియాలో అగ్రరాజ్యంగా పట్టు సాధించేందుకు చైనా భారీ వ్యయంతో మొదలుపెట్టిన అతి భారీ మౌలిక సదుపాయాల నిర్మాణ ప్రాజెక్టు. నిజానికి ఈ సిల్క్రోడ్కొత్తదేమీ కాదు. అతి ప్రాచీన కాలం నుండి ఇటీవలి వరకూ కొన్ని వందల ఏళ్ల పాటు తూర్పు ప్రపంచాన్ని పశ్చిమ ప్రపంచంతో అనుసంధానించిన వాణిజ్య మార్గాల వ్యవస్థ ఇది. తూర్పు, పశ్చిమ నాగరికతల మధ్య వారధి. ఇందులో సుదీర్ఘమైన రహదారులు, సుదూర సముద్ర మార్గాలు ఉన్నాయి. ఈ ప్రాచీన సిల్క్‌రోడ్‌నే చైనా తన ఆర్థిక, వాణిజ్య విస్తరణకు, రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి అధునాతనంగా తీర్చిదిద్దాలని తలపెట్టింది. ఇందుకోసం దాదాపు ఐదు కోట్ల కోట్ల రూపాయలు (8 ట్రిలియన్డాలర్లు) పెట్టుబడులుగా పెడుతోంది. దాదాపు 60 దేశాలను కలుపుతూ నిర్మిస్తున్న ఈ భూ, జల మార్గాల రవాణా వ్యవస్థకు ‘వన్‌బెల్ట్ వన్‌రోడ్’ ప్రాజెక్టుగా చైనా పేరు పెట్టింది. దీనినే 21 శతాబ్దపు సిల్క్‌రోడ్‌గా వ్యవహరిస్తున్నారు. చైనా ఇంతటి భారీ ప్రాజెక్టును ఎందుకు తలపెట్టింది? దీనిపై భారత వైఖరి ఏమిటి? పశ్చిమ దేశాల స్పందన ఎలా ఉంది? అనే వివరాలు సంక్షిప్తంగా... ఏమిటీ వన్‌బెల్ట్ వన్‌రోడ్‌ప్రాజెక్టు..?: ప్రాచీన సిల్క్‌రోడ్‌మార్గాల్లో.. 21వ శతాబ్దపు సిల్క్రోడ్ఎకానమిక్కారిడార్, సముద్ర సిల్కు మార్గాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేయాలంటూ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్2013లో వివిధ ఆసియా దేశాల పర్యటనలో ప్రతిపాదన తెచ్చారు. మధ్య ఆసియా, పశ్చిమాసియా, తూర్పు మధ్య ఆసియా, యూరప్‌దేశాల మీదుగా గల పురాతన సిల్క్రోడ్వెంబడి గల దేశాలను కలుపుతూ మౌలిక సదుపాయాల నిర్మాణం, సాంస్కృతిక రాకపోకల పెంపు, వాణిజ్య విస్తరణల ద్వారా ఆర్థిక కారిడార్‌ను అభివృద్ధి చేయాలన్నది ఆ ప్రతిపాదన లక్ష్యం. దీనిని దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలకూ విస్తరించాలన్నది ఉద్దేశం. ఈ ప్రాంతంలోని చాలా దేశాలు చైనా సారధ్యంలోని ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (ఏఐఐబీ)లో సభ్య దేశాలు కూడా. ఇందులో ఉత్తర వరుస మధ్య ఆసియా, రష్యా మీదుగా యూరప్‌వరకూ వెళుతుంది. మధ్య వరుస మధ్య ఆసియా, పశ్చిమాసియా మీదుగా పర్షియన్‌గల్ఫ్, మధ్యధరా ప్రాంతం వరకూ వెళుతుంది. దక్షిణ వరుస చైనా నుంచి మొదలై ఆగ్నేయాసియా, దక్షిణాసియా, హిందూమహాసముద్రంల మీదుగా వెళుతుంది. అలాగే.. 21వ శతాబ్దపు సముద్ర సిల్క్‌రోడ్‌ప్రాజెక్టులో భాగంగా.. దక్షిణ చైనా సముద్రం, దక్షిణ పసిఫిక్మహాసముద్రం, హిందూ మహాసముద్రాల మీదుగా దక్షిణాసియా, ఓషియానా, ఉత్తర ఆఫ్రికాలను కలపడం లక్ష్యం. ఈ ‘వన్‌బెల్ట్ వన్‌రోడ్’ ప్రాజెక్టుకు అనుబంధంగా చైనా పాకిస్తాన్‌ఆర్థిక కారిడార్(సీపీఈసీ), బంగ్లాదేశ్ చైనా ఇండియా మయన్మార్(బీసీఐఎం) ఆర్థిక కారిడార్లను కూడా చైనా అభివృద్ధి చేస్తోంది. ముఖ్యంగా.. చైనా నవీన సిల్క్‌రోడ్‌ప్రాజెక్టులో భూ సముద్ర మార్గాలను అనుసంధానించే లింకు సీపీఈసీ. ఈ సీపీఈసీలో పాకిస్తాన్‌లోని గ్వాదర్‌ఓడరేవు కేంద్ర బిందువు. ఈ ప్రాజెక్టు వెనుక వ్యూహం ఏమిటి..?: చైనా ఈ భారీ ప్రాజెక్టును చేపట్టడం వెనుక ఆర్థిక, భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నాయనేది అంతర్జాతీయ పరిశీలకుల అంచనా. అభివృద్ధిలో వెనుకబడిన యురేసియా, ఆఫ్రికా దేశాలలో రోడ్లు, రైల్వే లైన్లు, ఓడరేవులు నిర్మించాలన్న చైనా ప్రణాళిక వాస్తవానికి రాజకీయ ప్రేరేపితమైనదని.. అమెరికాను తోసిరాజని ఆసియాలో తన నాయకత్వ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు రచించిన వ్యూహమని ఫిట్చ్‌రేటింగ్స్‌అనే సంస్థ తన నివేదికలో అభివర్ణించింది. ఇది ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా తనను తాను స్థాపించుకునేందుకు, ప్రత్యేకించి దక్షిణాసియా దేశాల్లో తన బలాన్ని విస్తరించుకునేందుకు అమలు చేస్తున్న అద్భుత ప్రణాళికగా భావిస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్వంటి దక్షిణాసియా దేశాల్లో మౌలక సదుపాయాల నిర్మాణం కోసం వందల కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. ఇది చైనాకు వాణిజ్యపరంగానూ సైనికపరంగానూ చాలా కీలక అవకాశాలు కల్పిస్తోంది. అలాగే.. చైనా పారిశ్రామిక ఉత్పాదకత ముఖ్యంగా ఇనుము, సిమెంట్, భారీ పరికరాల తయారీ రంగాల సామర్థ్యం మిగులు స్థాయికి పెరిగిపోయింది. ఆ మిగులు ఉత్పత్తుల వినియోగానికి ఈ భారీ మౌలిక సదుపాయాల నిర్మాణ ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతుంది. మరోవైపు చైనా అంతర్గత మార్కెట్కూడా మందగిస్తోంది. కొత్త వాణిజ్య విపణులకు చేరుకోవడం ద్వారా తమ దేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజితం చేయడానికి వీలుంటుంది. సీమాంతర వాణిజ్యం దశాబ్ద కాలంలో 2.5 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుందని చైనా ఆశిస్తోంది. అందుకే లక్ష కోట్ల డాలర్ల ప్రభుత్వ నిధులను ఈ ప్రాజెక్టులో పెట్టుబడులుగా మళ్లించింది. చైనా ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక సంస్థలను కూడా విదేశాల్లో మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సర్కారు ప్రోత్సహిస్తోంది. తజకిస్తాన్, థాయ్‌లాండ్, కెన్యాల్లో రైల్వేల నిర్మాణ పనులు, వియత్నాం, కిర్గిజిస్తాన్‌లలో విద్యత్ప్లాంట్లు వంటి డజన్ల కొద్దీ ప్రాజెక్టులను చైనా ప్రారంభించింది. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలోనూ భారీ నౌకా ప్రాజెక్టులు నిర్మిస్తోంది. అందులో చాలా వరకూ చైనానే పెట్టుబడులు పెట్టింది. ‘‘ఆయా దేశాల్లో చైనా పెట్టుబడుల్లో అత్యధిక భాగం రుణాల రూపంలోనే ఉంటాయి. తనే రుణాలు ఇచ్చి తన ఉత్పత్తులు, సాంకేతికతలనే ఉపయోగించి ఈ మౌలిక నిర్మాణాలు చేపడుతుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలు చైనాకు రుణపడి ఉంటాయి. అది చైనా ప్రాంతీయ ఆధిపత్యానికి విధేయతగానూ ఉంటుంది. చైనాకు ఆర్థికంగానూ లాభిస్తుంది’’ అని మరికొందరు పరిశీలకుల విశ్లేషణ. ఇది రెండో ప్రపంచీకరణ..: ఇది చైనాను ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లతో అనుసంధానించే ప్రణాళిక. పాతికేళ్ల కిందట ప్రపంచీకరణ అగ్రరాజ్యం అమెరికా సారథ్యంలోని పశ్చిమ దేశాలతో మొదలైంది. ఇప్పుడు అవే పశ్చిమ దేశాలు అమెరికా సహా ప్రపంచీకరణ నుంచి వెనుదిరుగుతున్నాయి. ఇప్పుడు తూర్పు ప్రపంచం నుంచి చైనా సారథ్యంలో రెండో ప్రపంచీకరణ మొదలవుతోంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులకు లోనవుతోందని, అంతర్జాతీయ ఓపెన్‌మార్కెట్లకు కట్టుబడి ఉంటామని చైనా బాహాటంగానే చెప్తోంది. ‘వన్‌బెల్ట్ వన్‌రోడ్’ ప్రాజెక్టు రెండో ప్రపంచీకరణ వంటిదని చైనా అధికారిక మీడియా సంస్థ జిన్హువా అభివర్ణించింది. భారత్అభ్యంతరం ఏమిటి..?: చైనా బృహత్తర ప్రాజెక్టు ప్రపంచగతిని మార్చేస్తుందని పాకిస్తాన్స్వాగతిస్తోంది. ముఖ్యంగా చైనా పాక్‌మ్రైత్రిని సీపీఈసీ వ్యూహాత్మక ఆర్థిక భాగస్వామ్యంగా మారుస్తుందని పాక్హర్షం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే సన్నిహిత రాజకీయ, సైనిక సంబంధాలున్న పాక్ చైనాల స్నేహానికి కొత్తగా కీలకమైన ఆర్థిక కోణాన్ని కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుంది. కానీ.. భారతదేశంలో ఈ ప్రాజెక్టు మీద భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే.. పాకిస్తాన్‌మీద సహజమైన వ్యతిరేకత, చైనా మీద వ్యూహాత్మక అపనమ్మకం భారత్‌లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. పొరుగు దేశాల్లో ప్రాబల్యం పెంచుకోవడం చైనా ఉద్దేశమని భారత్భావిస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. వన్‌బెల్ట్ వన్‌రోడ్‌ప్రాజెక్టు విషయంలో చైనాతో కూలంకుషంగా చర్చించనిదే భాగస్వాములం కాబోమని స్పష్టం చేసింది. అణ్వాయుధ దేశాలైన చైనా, పాకిస్తాన్ల మధ్యలో భారత్ఉంది. ఆ రెండు దేశాలతోనూ భారత్‌యుద్ధాలు చేసింది. చైనాతో 1962 యుద్దం తాలూకు నీలినీడలు ఇంకా తొలగిపోలేదు. ఈ పరిస్థితుల్లో చైనాలోని పశ్చిమ ప్రాంతాన్ని పాకిస్తాన్లో చైనాయే నిర్మించిన గ్వాదర్ఓడరేవును కలుపుతూ చైనా పాక్ఆర్థిక కారిడార్‌ను చైనా చేపట్టింది. ఈ కారిడార్.. వాస్తవ కశ్మీర్లో భాగమైన గిల్గిట్ బాల్తిస్తాన్, పాక్ఆక్రమిత కశ్మీర్‌ల మీదుగా పాక్‌లో ప్రవేశిస్తుంది. ఇదే భారత్‌కు తీవ్ర అభ్యంతరమైన విషయం. భారత్‌లో అంతర్భాగమైన కశ్మీర్‌లోని గిల్గిట్, పీఓకేలు భారత్ పాక్‌ల మధ్య వివాదాస్పద ప్రాంతాలుగా ఉండగా.. అందులో నుంచి మూడో దేశమైన చైనా ఆర్థిక కార్యకలాపాలు నెరపడం, భారీస్థాయిలో మౌలిక సదుపాయాలను నిర్మించడం.. భారత సార్వభౌమాధికారానికి, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తోందని మండిపడుతోంది. అందువల్లే.. కొద్ది రోజుల కిందట చైనా నిర్వహించిన సదస్సుకు భారత్‌హాజరుకాలేదు. భారత్‌తో పాటు, చైనా, ఇండొనేసియా, రష్యా తదితర దేశాలు కూడా చైనా ‘వన్‌రోడ్’ ప్రాజెక్టుపై ఆందోళన చెందుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులు నిర్మిస్తున్న చైనా ఈ భారీ ప్రాజెక్టు ద్వారా ప్రాంతీయ ఏకచ్ఛత్రాధిపత్యం కోసం వ్యూహం రచిస్తోందని జపాన్, ఇండొనేసియాల ఆందోళన. ఉజ్బెకిస్తాన్తదితర మధ్య ఆసియా దేశాలను చైనా ఆర్థిక వ్యవస్థతో మరింత సన్నిహితంగా అనుసంధానించడం ద్వారా అక్కడ తన ప్రాబల్యాన్ని నీరుగారుస్తోందని రష్యా కలవరపడుతోంది. సిల్క్‌రూట్.. రెండు వేల ఏళ్ల చరిత్ర: తూర్పు పశ్చిమ దేశాలకు వారధిగా నిలిచిన ప్రాచీన సిల్క్‌మార్గం.. చైనా కింద కొరియా ద్వీపకల్పం నుంచి జపాన్‌మీదుగా మధ్యధరా సముద్రం వరకూ విస్తరించింది. ప్రస్తుత శకానికి పూర్వం (క్రీస్తు పూర్వం) 207 నాటి హాన్‌హయాంలో మొదలైన ఈ మార్గాల అన్వేషణ ఆసియా ఖండంలోని దాదాపు అన్ని దేశాలనూ కలుపుతూ.. అరబ్‌దేశాల మీదుగా ఐరోపా వరకూ విస్తరించింది. భూమి మీద రహదారి మార్గాలు, సముద్రం మీద జల మార్గాలతో కూడిన ఈ సిల్క్‌రోడ్.. రెండు వేల ఏళ్లకు పైగా చైనా, కొరియా, జపాన్, భారత ఉపఖండం, పర్షియా, యూరప్, ఆఫ్రికా కొమ్ము, అరేబియా దేశాల మధ్య వాణిజ్య, రాజకీయ, సాంస్కృతిక సంబంధాలకు వారధిగా నిలిచింది. ప్రధానంగా చైనాలో ఉత్పత్తి అయిన సిల్కును గుర్రాల మీద ఈ మార్గాల ద్వారా రవాణా చేస్తుండటంతో దీనికి సిల్క్‌మార్గంగా పేరు వచ్చింది. ఇతర వస్తువులు, మతాలు, సంస్కృతులు, సిద్ధాంతాలు, సాంకేతికతలు దేశదేశాలకూ పయనించడానికి, సమ్మిశ్ర నాగరికతలు అభివృద్ధి చెందడానికి ఈ మార్గాలు దోహదం చేశాయి. ప్లేగు వంటి వ్యాధులు కూడా ఈ మార్గాల ద్వారా ప్రబలాయి. చైనీయులు, అరబ్బులు, తుర్కులు, భారతీయులు, పర్షియన్లు, సోమాలియన్లు, గ్రీకులు, సిరియన్లు, రోమన్లు, జార్జియన్లు, అర్మీనియన్లు, బ్యాక్టీరియలన్లు, సోగ్దియన్లు ఈ మార్గాలను ఉపయోగించుకున్న వారిలో ముఖ్యులు. ఈ ప్రాచీన సిల్క్‌మార్గాన్ని యునెస్కో 2014లో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తించింది. (సాక్షి నాలెడ్జ్సెంటర్) -
సిల్క్ రోడ్డుపై 124 బి.డాలర్ల పెట్టుబడులు: చైనా
బీజింగ్: చైనాను ఆసియా, యూరోప్, ఆఫ్రికా దేశాలతో అనుసంధానం చేసే సిల్క్‌రోడ్డు ప్రాజెక్టుపై 124 బిలియన్ డాలర్ల (రూ. 8 లక్షల కోట్లు) పెట్టుబడులు పెడతామని ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు. సిల్క్ రోడ్డు, బెల్ట్‌ను శతాబ్దపు ప్రాజెక్టుగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మేలు చేకూర్చేదిగా అభివర్ణించారు. సహకారానికి ఉమ్మడి వేదికను నిర్మిస్తామని, స్వేచ్చాయుత అభివృద్ధి చెందే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తమ మద్దతు ఉంటుందన్నారు. 40 బిలియన్ అమెరికన్ డాలర్ల సిల్క్ రోడ్డు ఫండ్‌కు చైనా అదనంగా 100 బిలియన్ యువాన్లను సమకూరుస్తుందని జిన్‌పింగ్ చెప్పారు. కాగా, పాకిస్తాన్‌తో కలసి చైనా చేపట్టిన ఈ ప్రాజెక్టును మన దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. -
12వేల కిలోమీటర్లు ప్రయాణించింది
న్యూఢిల్లీ: లండన్ నుంచి ఓ రైలు సుమారు 12వేల కిలోమీటర్లు(7500 మైళ్లు) ప్రయాణించి శనివారం చైనా చేరింది. ఈ ట్రైన్ దక్షిణ యూరప్ గుండా ప్రయాణించింది. సుమారు 15 ప్రధాన పట్టణాలను దాటకుంటూ వచ్చింది. దీనిపేరు ఈస్ట్ విండ్. ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద రైలు మార్గం. దీనికి సిల్కరోడ్ గా నామకరణం చేశారు 2013లో చైనా వన్ బెల్టు వన్ రోడ్ విధానంలో వివిధ మార్గాలను కలుపుకుంటూ అతిపెద్ద రవాణా వ్యవస్థ ఏర్పాటు చేస్తోంది. దీనిలో భాగంగానే లండన్ నుంచి చైనాకు ఈ రైలు మార్గాన్ని నిర్మించింది. ఈ రైలు విస్కీ బాటిళ్లు, పిల్లల పాలు, మందులు, యంత్రాలతో ఏప్రిల్10న లండన్‌లో బయలుదేరింది. ప్రాన్స్, బెల్జియం, జర్మనీ, పోలాండ్, బెలారస్, రష్యా, కజకిస్థాన్ దేశాల గుండా 20 రోజుల ప్రయాణం అనంతరం తూర్పు చైనాలోని ఈవు పట్టణానికి శనివారం చేరుకుంది. దీనిలో సుమారు 88 షిప్ కంటెనర్లతో ప్రయాణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.