breaking news
Shimla Municipal Corporation
-
నేటితో ‘హిమాచల్’కు 76 ఏళ్లు!
హిమాచల్ ప్రదేశ్ ఈరోజు 76వ ఏట అడుగుపెట్టింది. ఈ రాష్ట్రం 1948 ఏప్రిల్ 15న ఆవిర్భవించింది. నేడు హిమాచల్ దినోత్సవాన్ని సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. అనేక మైలురాళ్లను దాటిన హిమాచల్ ప్రదేశ్ నేడు అన్ని రంగాల్లోనూ ముందు వరుసలో ఉంది. 1948లో హిమాచల్ ప్రదేశ్లో అక్షరాస్యత రేటు ఏడు శాతంగా ఉంది. ఇది 76 సంవత్సరాల తర్వాత అంటే నేటికి 82.80 శాతానికి చేరుకుంది. రాష్ట్రంలో మూడు విమానాశ్రయాలు ఉన్నాయి. 1948లో వీటి సంఖ్య సున్నా. ఆరోగ్య రంగంలో కూడా రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. హిమాచల్లో ప్రస్తుతం ఒక ఎయిమ్స్, ఐదు వైద్య కళాశాలలు, ఐదు డెంటల్ కళాశాలలు, పలు నర్సింగ్, ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యనభ్యసించేందుకు విద్యార్థులు ఇక్కడికి వస్తున్నారు. 1948వ సంవత్సరంలో హిమాచల్ ప్రజల తలసరి ఆదాయం రూ.240 కాగా, ప్రస్తుతం రూ.2,35,199కి చేరుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త యశ్వంత్ సింగ్ పర్మార్ హిమాచల్ తొలి ముఖ్యమంత్రి. ఈయన 1952 నుండి 1977 వరకు అధికారంలో ఉన్నారు. ఠాకూర్ రామ్ లాల్ 1977, 1980లలో రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. శాంత కుమార్ 1977, 1990లో రెండుసార్లు అధికారంలో కొనసాగారు. వీరభద్ర సింగ్ 1985, 1993, 2003, 2012,2017లో ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రేమ్ కుమార్ ధుమాల్ 1998, 2007లో అధికారాన్ని చేపట్టారు. 2017లో జైరాం ఠాకూర్ ముఖ్యమంత్రి అయ్యారు. సుఖ్విందర్ సింగ్ సుఖు 2023 నుండి అధికారంలో కొనసాగుతున్నారు. -
బీజేపీ సంచలన విజయం!
షిమ్లా: షిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి చరిత్ర సృష్టించింది. గురువారం వెలువడిన ఫలితాల్లో ఆ పార్టీ గతంలో ఎన్నడూలేనివిధంగా అత్యధిక సీట్లు సాధించింది. 34 స్థానాలు ఉన్న షిమ్లా మున్సిపాల్ కార్పొరేషన్లో బీజేపీ 17 సీట్లు సాధించి.. మెజారిటీ (18)కి ఒక్క స్థానం దూరంలో నిలిచింది. బీజేపీ బద్ధ విరోధి కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలతో సరిపెట్టుకుంది. 26 ఏళ్లుగా షిమ్లా నగరపాలక మండలిలో చక్రం తిప్పిన కాంగ్రెస్.. గత 2012 ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. తాజా ఎన్నికల్లో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు, ఒక సీపీఎం అభ్యర్థి కూడా విజయం సాధించారు. స్వతంత్రుల్లో ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించినా.. ఆ పార్టీ 15స్థానాలతో మెజారిటీకి చాలా దూరంలో ఉంది. మెజారిటీకి ఒక్కస్థానం తక్కువగా ఉన్న బీజేపీ మాత్రం షిమ్లా మున్సిపాలిటీని తామే కైవసం చేసుకుంటామని, ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు తమకుందని ప్రకటించింది. 2012లో ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఓటింగ్ నిర్వహించగా సీపీఎం సంచనలరీతిలో ఈ పదవులను సొంతం చేసుకుంది. ఈ సారి పరోక్ష పద్ధతిలో మెజారిటీ ఆధారంగా ఎన్నికలు నిర్వహించగా.. ఈసారి అనూహ్యంగా కమలనాథులను విజయం వరించడం గమనార్హం.